రానున్న టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో భారత్ నుంచి పాల్గొననున్న అథ్లెట్ల ప్రదర్శన పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి కిరన్ రిజిజు(Kiren Rijiju). ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి భారత్ సంసిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి భారతీయుడు ముందుకు రావాలని రిజిజు కోరారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు మంత్రి.
-
I invite every Indian to cheer for our athletes as they train to win laurels for India despite difficult times. Yes, India is ready to go and shine at the #Tokyo2020 Olympics!#HumHongeKamyab #TeamIndia #SonySportsNetwork #Olympics#OlympicsJosh #JaiHind 🇮🇳🇮🇳 pic.twitter.com/3dVaNE2PHa
— Kiren Rijiju (@KirenRijiju) May 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I invite every Indian to cheer for our athletes as they train to win laurels for India despite difficult times. Yes, India is ready to go and shine at the #Tokyo2020 Olympics!#HumHongeKamyab #TeamIndia #SonySportsNetwork #Olympics#OlympicsJosh #JaiHind 🇮🇳🇮🇳 pic.twitter.com/3dVaNE2PHa
— Kiren Rijiju (@KirenRijiju) May 29, 2021I invite every Indian to cheer for our athletes as they train to win laurels for India despite difficult times. Yes, India is ready to go and shine at the #Tokyo2020 Olympics!#HumHongeKamyab #TeamIndia #SonySportsNetwork #Olympics#OlympicsJosh #JaiHind 🇮🇳🇮🇳 pic.twitter.com/3dVaNE2PHa
— Kiren Rijiju (@KirenRijiju) May 29, 2021
"ఈ విపత్కర సమయంలో దేశం కోసం ఒలింపిక్స్‌లో ఆడటానికి వెళ్తున్నా.. అథ్లెట్లను ఉత్సాహాపరచడానికి.. ప్రతి భారతీయుడు ముందుకు రావాలి. అవును, ఈ మెగా ఈవెంట్లో పాల్గొని.. విజయవంతమవడానికి ఇండియా సిద్ధంగా ఉంది."
-కిరన్ రిజిజు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి.
ఒలింపిక్స్‌కు ముందు ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్లందరికీ టీకాలు ఇవ్వడానికి సిద్ధమని భారత ఒలింపిక్ సంఘం స్పష్టం చేసింది. ఇందులో కొంత మంది ఇప్పటికే తొలి డోసును తీసుకున్నారని.. మరికొందరు రెండో డోసును కూడా పూర్తి చేసుకున్నారని తెలిపింది.
ఇదీ చదవండి: 'ఒలింపిక్స్ స్ట్రెయిన్' ఆవిర్భావం తప్పదు!