అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య(ఐఎస్ఎస్ఎఫ్) అధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ (ISSF Junior World Championship 2021) ముగిసింది. భారత్ 30 పతకాలతో పతకాల పట్టికలో టాప్‌లో నిలిచింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో అనిశ్ బన్వాలా, ఆదర్శ్ సింగ్, విజయ్‌వీర్ సింధు సంయుక్తంగా స్వర్ణం సాధించారు.
మను బకర్ మూడు బంగారు పతకాలు సాధించింది. పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మను బంగారు పతకం సాధించగా, రిథమ్ సంగ్వాన్, శిఖా నర్వాల్‌లతో జతకట్టి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో కూడా గోల్డ్ పట్టేసింది. బెలారస్‌ను ఈ బృందం 16-12తో ఓడించింది. మాన్వీ సోనీ 105 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించింది. 50 మీటర్ల రైఫిల్‌లో ఆయుశీ పొడ్డర్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్‌ల జోడీ రజతం కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: IND VS AUS: ఆసీస్ చేతిలో టీమ్ఇండియా ఓటమి