ETV Bharat / sports

గ్రాండ్​మాస్టర్​గా మరో తెలుగు కుర్రాడు - గ్రాండ్‌మాస్టర్‌గా తెలంగాణ కుర్రాడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌

నాన్నను చూసి.. ఎత్తులు వేసి.. నాన్న పావులు కదిపితే ఆసక్తిగా గమనించిన ఆ తెలుగు కుర్రాడు ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాడు. తొమ్మిదేళ్ల వయసులో ఓనమాలు దిద్దుకున్న అతడు పంతొమ్మిదేళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు.  జీఎంగా నిలవాలన్న కల నిజమైందని ఇటలీ నుంచి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకీ అతడెవరంటే?

Hyderabad Rahul Srivastshav becomes Indis's 74th Grandmaster
లంగాణ కుర్రాడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌ గ్రాండ్‌మాస్టర్‌
author img

By

Published : Jun 12, 2022, 7:04 AM IST

చదరంగంలో మరో తెలుగు తేజం మెరిశాడు. తెలంగాణ కుర్రాడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ జీఎం హోదా సాధించాడు. 2019లోనే అతను మూడు జీఎం నార్మ్‌లు గెలిచినప్పటికీ.. ఎలో రేటింగ్‌ 2500 కంటే తక్కువ ఉండడంతో గ్రాండ్‌మాస్టర్‌ కాలేకపోయాడు. ఇప్పుడు ఇటలీలో జరిగిన కతోలిక చెస్‌ ఫెస్టివల్‌లో భాగంగా.. ఎనిమిది రౌండ్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌తో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో తన రేటింగ్‌ 2500కు చేరింది. దీంతో జీఎం ఘనత సొంతమైంది. అతని ఖాతాలో మొత్తం అయిదు జీఎం నార్మ్‌లున్నాయి. చెస్‌లో అత్యున్నత ఘనత అయిన గ్రాండ్‌మాస్టర్‌ కావాలంటే మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్‌ ఉండాలి. ఈ టోర్నీలో మొత్తం 9 రౌండ్లలో అపజయమే ఎరుగని అతను.. మూడు గేమ్‌ల్లో గెలిచి, ఆరు గేమ్‌లను డ్రాగా ముగించాడు. ఆరు పాయింట్లు సాధించాడు. భారత 74వ జీఎంగా అతను నిలిచాడు. తెలంగాణ నుంచి అర్జున్‌ ఇరిగేశి, హర్ష భరత్‌కోటి, రాజా రిత్విక్‌ తర్వాత నాలుగో జీఎంగా రికార్డు సృష్టించాడు. "100 గ్రాండ్‌మాస్టర్ల సంఖ్యను చేరుకునే దిశగా భారత్‌ మరో అడుగు ముందుకేసింది. ఈ అరుదైన క్లబ్బులోకి తాజాగా తెలంగాణకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌ చేరాడు. అతనికి, తన కోచ్‌కు, కుటుంబ సభ్యులకు అభినందనలు’" అని అఖిల భారత చెస్‌ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్‌ కపూర్‌ శనివారం ట్వీట్‌ చేశాడు.

రాహుల్​ మాట్లాడుతూ.. "గ్రాండ్‌మాస్టర్‌ రాహుల్‌.. అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్లుగా దీని కోసం ఎదురు చూస్తున్నా. 2019లోనే మూడు జీఎం నార్మ్‌లు సాధించా. కానీ కరోనా కారణంగా టోర్నీలు లేకపోవడంతో రేటింగ్‌ పాయింట్లు దక్కించుకునే అవకాశం రాలేదు. ఇప్పటికీ ఆ కల నెరవేరింది. 9 ఏళ్ల వయసులో శిక్షణ మొదలెట్టి.. 19 ఏళ్లకు జీఎంగా నిలవడం వరకూ సాగిన నా ప్రయాణం ఎంతో సంతృప్తినిస్తోంది. చిన్నప్పుడు నాన్న ఆడుతుంటే చూసి చదరంగంపై ఇష్టం పెంచుకున్నా. నాన్న కళాశాల స్థాయిలో చెస్‌ ఆడాడు. ఆటపై ఆసక్తి చూపడంతో నన్ను ప్రోత్సహించాడు. మురళీ కృష్ణ దగ్గర శిక్షణలో చేర్పించాడు. రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్‌గా నిలవడంతో ఇక ఆటను వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత రామరాజు దగ్గర శిక్షణ పొందా. ఇప్పుడు నా కోచ్‌.. నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ సిప్కీ ఎర్న్‌స్ట్‌.
వాళ్లే కారణం..: నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మానాన్నే కారణం. రాష్ట్ర స్థాయిలో అండర్‌-9, అండర్‌-11 ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత నా శిక్షణపై వాళ్లు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించడంతో ఇంకా ప్రోత్సహించారు. నాన్న శ్రీకాంత్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో డిజైనర్‌గా పని చేస్తున్నారు. అమ్మ విజయలక్ష్మీ గృహిణి. చెస్‌లో శిక్షణ పొందడం, విదేశాల్లో టోర్నీల్లో పాల్గొనడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా ఆటకు ఎలాంటి ఆటంకం లేకుండా నాన్న చూస్తున్నాడు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ 2018లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా నిలిచా. 2019లో గ్రీస్‌ టోర్నీలో తొలి జీఎం నార్మ్‌ సాధించా. అప్పుడే నా ఆరాధ్య ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను తొలిసారి కలిశా. అదే ఏడాది మరో రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా. ఇక రేటింగ్‌ సాధించి జీఎం అవడమే ఆలస్యమనుకున్నా. కానీ ఇంతలో కరోనా అడ్డుపడింది.
విరామం వచ్చినా..: ఆటకు విరామం వచ్చినా శిక్షణ మరింత తీవ్రతరం చేశా. అంతర్జాలంలో సాధన కొనసాగించా. ఇంతలో యుఎస్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీలో చేరే అవకాశం వచ్చింది. చెస్‌ ఆటగాడిగా ఉపకార వేతనం పొంది అక్కడ చేరా. చదువుతో పాటు ఆటనూ సమన్వయం చేసుకుంటున్నా. ఆరంభంలో కాస్త ఇబ్బంది అనిపించినా ఇప్పుడు పర్వాలేదు. రోజూ మూణ్నాలుగు గంటల పాటు సాధన చేస్తా. ఆట కాకుండా ఇతర వ్యాపకాలంటే సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం. గెలుపోటములను సమానంగా తీసుకోవడమే ఆటగాడి లక్షణం. ఆటలో పరాజయాలు సాధారణమే. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని నమ్ముతా. నా రేటింగ్‌ను 2600కు పైగా పెంచుకోవాలనేది ఇప్పుడు నా లక్ష్యం.

ఇదీ చూడండి: నార్వే చెస్​ ఓపెన్​ ఛాంపియన్​గా ప్రజ్ఞానంద​.. మూడోస్థానంలో ఆనంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.