ETV Bharat / sports

Himadas Suspended : భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్​కు షాక్​.. కనీసం ఏడాది పాటు నిషేధం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 6:07 PM IST

Updated : Sep 5, 2023, 7:36 PM IST

Himadas Suspended : భారత అథ్లెటిక్స్‌ స్టార్‌ హిమదాస్‌పై వేటు పడింది. నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్​ ఏజెన్సీ) అధికారులు ఆమెపై బ్యాన్ విధించారు. ఆ వివరాలు..

Himadas Suspended : హిమదాస్​కు షాక్​.. ఏడాది పాటు నిషేధం

Himadas Suspended : భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ షాకిచ్చింది నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్​ ఏజెన్సీ). ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసి బ్యాన్​ విధించింది. డోపింగ్ టెస్టులకు ఆమె అందుబాటులో లేని కారణంగా ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. 12 నెలల వ్యవధిలో ఆమె మూడుసార్లు ఈ టెస్ట్​లకు గైర్హాజరు అయినందు వల్ల ఈ చర్య తీసుకున్నారు అధికారులు.

"ఒక ఏడాది కాలంలో హిమదాస్​.. ముడు సార్లు డోపింగ్​ టెస్ట్​లకు హాజరుకాలేదు. అందుకే ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం" అని ఓ అధికారి తెలిపారు. సాధారణంగా హిమదాస్ చేసిన తప్పునకు గానూ రెండేళ్ల పాటు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆమెకు ఏడాది కాలానికి శిక్షను తగ్గించే అవకాశం ఉందని తెలిసింది. కాగా, ఈ 23 ఏళ్ల అస్సాం రన్నర్.. ఈ ఏడాది ప్రారంభంలో తగిలిన కాలి గాయం కారణంగా.. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పాల్గొనే అర్హత కోల్పోయింది. ఈ బిగ్​ ఈవెంట్​కు ఆమె దూరమవ్వడం పెద్ద షాక్ లాంటిదే.​ ఈ క్రీడలు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరగనున్నాయి.

Hima Das Gold Medal Asian Games 2018 : 2018లో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెం విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించింది హిమ దాస్​. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా గుర్తింపు సాధించింది. అప్పటి నుంచి ఎన్నో అంతర్జాతీయ పతకాలను ముద్దాడింది. అదే ఏడాది 2018 జకార్త ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం కూడా సాధించింది. 400 మీటర్ల విభాగంలో ఇండివిడ్యుయల్​గా(వ్యక్తిగత) సిల్వర్​ మెడల్​ను దక్కించుకుంది. అలానే మహిళల 4x400మీటర్ల విభాగంలో, మిక్స్​డ్ రిలే​ 4x400మీటర్ల విభాగంలో కూడా గోల్డ్​, సిల్వర్​ పతకాలను ముద్దాడింది. ఆమె సేవలను గుర్తించిన అసోం ప్రభుత్వం.. ఆమెకు అప్పుడు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదవిని కట్టబెట్టి సత్కరించింది. ఈ పదవితో పోలీస్‌ కావాలనే తన చిన్నప్పటి కలను నెరవేర్చుకుంది.

స్టార్ అథ్లెట్​ విషయంలో మోసపోయిన సెహ్వాగ్​.. అది నిజమని నమ్మి!

స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు

Last Updated : Sep 5, 2023, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.