పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. ఆ మ్యాచ్ అనంతరం హర్దిక్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు స్కానింగ్ చేయగా.. అతడి గాయం తీవ్రంగా ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇక అతడి స్థానం భర్తీపై ఇంకా మేనేజ్‌మెంట్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
కాగా హార్దిక్.. భారత జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అదే విధంగా ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కూడా గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇకపోత్ గ్రూపు-డీలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్.. తమ తదుపరి మ్యాచ్‌ను జనవరి 19న వేల్స్‌తో ఆడనుంది.
ఇదీ చూడండి: ఎన్టీఆర్‌తో టీమ్ఇండియా సందడి.. ఫొటో చూశారా?