ETV Bharat / sports

నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా: చాను

author img

By

Published : Apr 18, 2021, 4:37 PM IST

ఆసియా వెయిట్​లిఫ్టింగ్​ ఛాంపియన్​షిప్​లో తన ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నట్లు భారత వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ చాను తెలిపింది. తనపై ప్రేమతో పాటు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది.

Happy with my performance at Asian Championships, Mirabai Chanu after bagging bronze medal
మీరాబాయ్ చాను, ఆసియా వెయిట్​లిఫ్టింగ్ ఛాంపియన్​షిప్స్​

ఆసియా వెయిట్​లిఫ్టింగ్​ ఛాంపియన్​షిప్​లో సరికొత్త రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందని తెలిపింది భారత వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయ్ చాను. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పేర్కొంది. క్లీన్​ అండ్ జెర్క్​ విభాగంలో 119 కేజీల బరువును ఎత్తిన చాను.. గతంలో చైనా క్రీడాకారిణి జియాంగ్​(118 కేజీ) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. దీంతో పాటు కాంస్య పతకం సాధించింది.

  • I am happy with my performance at the Asian Championship 2021. Thank you everyone for your love and support. I will continue to work hard and improve myself. pic.twitter.com/9pJERrVj80

    — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) April 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆసియా ఛాంపియన్​షిప్​ పోటీల్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. నాపై ప్రేమతో పాటు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నిరంతరం కష్టపడుతూ నన్ను నేను మెరుగుపరుచుకుంటాను."

-మీరాబాయ్ చాను, భారత వెయిట్ లిఫ్టర్.

ఇదీ చదవండి: భారత బాక్సర్ల సత్తా- క్వార్టర్స్​లో ఐదుగురు

మీరాబాయ్​ విజయానంతరం ఆమెను కేంద్ర క్రీడా మంత్రి కిరణ్​ రిజిజు ట్విట్టర్​ వేదికగా అభినందించారు.

''ఏడాది అనంతరం మీరాబాయ్​ ఆడుతున్న తొలి పోటీల్లోనే సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం.. దీంతో పాటు కాంస్య పతకాన్ని గెలుపొందడం గొప్ప విషయం. ఒలింపిక్​ లక్ష్యంగా నీ సాధన మొదలుపెట్టు మీరాబాయ్''​ అని మంత్రి ట్వీట్ చేశారు.

మంత్రి ట్వీట్​పై స్పందించిన చాను.. ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. అత్యుత్తమ క్రీడా సౌకర్యాలతో పాటు అన్ని విధాల మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని పేర్కొంది.

ఇదీ చదవండి: వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.