భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు హంగేరిలో ఆమె శిక్షణ తీసుకోనుంది.
40 రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ కోసం కేంద్ర క్రీడాశాఖ రూ.15.51 లక్షలు మంజూరు చేసింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్)లో భాగంగా ఈ మొత్తం కేటాయించినట్లు క్రీడాశాఖ ప్రకటించింది. తన వ్యక్తిగత కోచ్ వోలెర్ అకోస్ పర్యవేక్షణలో సహచర రెజ్లర్ ప్రియాంక ఫొగాట్‌తో కలిసి వినేశ్ శిక్షణ తీసుకోనుంది.
ఇదీ చూడండి : ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రెజ్లర్ బబిత!