భారత స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన కారణంగా ఐసీయూలో చేర్చామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించాయి.
మే 20న మిల్కా సింగ్‌కు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం మొదట మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం నిలకడగా ఉండగా.. ఆసుపత్రి నుంచి గత ఆదివారమే డిశ్ఛార్జ్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన కారణంగా చండీగఢ్‌లోని పీజీఐఎమ్ఈఆర్ ఆసుపత్రిలో చేరారు.
ఇవీ చదవండి: ఆసుపత్రి నుంచి మిల్కా సింగ్ డిశ్ఛార్జ్