ETV Bharat / sports

Commonwealth Games: సింధు పసిడి కల నెరవేరేనా? 'మిక్స్‌డ్' టైటిల్ భారత్​​ నిలబెట్టుకునేనా?

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో సత్తా చాటేందుకు పీవీ సింధుతోపాటు భారత స్టార్​ షట్లర్లు సమాయత్తమవుతున్నారు. గతంలో కంటే ఎక్కువ పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. 2018లో ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో జరిగిన పోటీల్లో వచ్చిన మిక్స్‌డ్ డబుల్స్​ టైటిల్‌ను నిలబెట్టుకొని.. మిగతా విభాగాల్లోనూ ఆధిపత్యం చలాయించాలని భారత బ్యాడ్మింటర్ ప్లేయర్స్​ శ్రమిస్తున్నారు.

Focus on Sindhu but doubles key to India retaining mixed team gold
సింధు స్వర్ణం కల నెరవేరేనా? మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్​ నిలబెట్టుకునేనా?
author img

By

Published : Jul 21, 2022, 5:55 PM IST

కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో వ్యక్తిగత విభాగాల్లో పసిడి పతకాలను ఒడిసి పట్టుకునేందుకు పీవీ సింధు సహా ఇతర భారత స్టార్​ షట్లర్లు ఊవ్విళ్లూరుతున్నారు. 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​లో రెండు స్వర్ణాల సహా ఆరు పతకాలను గెలిచిన భారత షట్లర్లు.. ఈ సారి అంతకు మించిన ఆట తీరుతో అదరగొట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్​ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు స్థిరమైన ప్రదర్శన కనబర్చాలనే వ్యూహంతో ముందుకెళ్లాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.

సింగిల్స్​తోపాటు డబుల్స్​లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​, లక్ష్య సేన్‌. సింగపూర్​ ఓపెన్​లో స్వర్ణం గెలిచిన సింధుతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్‌.. పసిడి పతకాన్ని సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పీవీ సింధు ఇప్పటి వరకు రెండు కామన్​వెల్త్​ గెమ్స్​లో పాల్గొన్నది. 2014లో కాంస్యం,​ గెలవగా.. 2018లో సిల్వర్​ గెలించింది. ఈ సారి ఎలాగైనా పసిడి గెలవాలని చూస్తోంది.

చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ద్వయం 2018 కామన్​వెల్త్​ క్రీడల్లో రజతం గెలుచుకున్నారు. అయితే ఈ సారి అంతుకు మించిన ఆటతో పసిడిని గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సారి వ్యక్తిగత పతకాల కంటే.. మిక్స్‌డ్‌ డబుల్స్​ ఈవెంట్స్ ​పైనే భారత్​ టీమ్​ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

2014 వరకు కామన్​వెల్త్​ గేమ్స్​లో మలేషియా, ఇంగ్లాండ్​ ఆధిపత్యమే ఉండేంది. అయితే 2018లో భారత బ్యాడ్మింటన్​ టీమ్​ చరిత్ర సృష్టించింది. రెండు స్వర్ణాలు సాధించింది మలేషియాను వెనక్కి నెట్టింది.

ప్రస్తుతం బ్యాడ్మింటన్​లో ఓవరాల్​ పతక విజేతల జాబితాలో భారత్​ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్​ (8 సార్లు విజేత), మలేషియా (5 సార్లు ఛాంపియన్‌లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్​ మొత్తం 109 పతకాలను సాధించగా.. మలేషియా 64 పతకాలతో రెండో స్థానంలో ఉంది. నంబర్​ వన్​ స్థానం చేరుకోవాడానికి భారత్​ ఇంకా చాలా శ్రమించాల్సి ఉంది.

బర్మింగ్​హామ్ గేమ్స్​లో భారత బ్యాడ్మింటన్​ ఆటగాళ్లకు నాకౌట్‌లోకి ప్రవేశించడం లాంఛనప్రాయమైనప్పటికీ.. వారికి నిజమైన పరీక్ష క్వార్టర్‌ఫైనల్‌ నుంచే ఎదురవుతుంది. రెండు సింగిల్స్.. మూడు డబుల్స్‌తో కూడిన ఫార్మాట్‌తో.. భారత టీమ్​ బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో సింధు, సేన్, శ్రీకాంత్‌ ఆట పట్ల అందరికీ పూర్తి స్థాయి నమ్మకం ఉంది. వీరు పతకాలను తెస్తారు అనడం ఎలాంటి సందేహం లేదు. అయితే డబుల్స్‌లో విభాగంలో కొత్త జోడీలు కావడం వల్ల వాళ్లు ఎలా ఏడతారో అనే అనుమానం రేకెత్తుతోంది.

1966లో జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​లో భారతదేశానికి మొదటి బ్యాడ్మింటన్ పతకాన్ని దినేశ్​ ఖన్నా అందిచారు. తొలిసారిగా కాంస్య పతకాన్ని తీసుకొచ్చారు దినేశ్​. బ్యాడ్మింటన్​లో ఇప్పటి వరకు ఏడు స్వర్ణాలు సహా 25 పతకాలను సాధించారు భారత క్రీడాకారులు.

ఇదీ చదవండి: 'వన్డే క్రికెట్​ అంతరించేలా ఉంది.. వాటిని తగ్గిస్తేనే మంచిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.