ETV Bharat / sports

వచ్చే ఏడాదిలోనూ ఒలింపిక్స్​ కష్టమే! - ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ

టోక్యో ఒలింపిక్స్​ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా కారణంగా వచ్చే ఏడాది కూడా ఈ మెగాటోర్నీ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని జపాన్​ దేశ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Even the Tokyo Olympics are difficult to manage next year
వచ్చే ఏడాదిలోనూ ఒలింపిక్స్​ కష్టమే!
author img

By

Published : Apr 21, 2020, 11:06 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. 2021, జులైకి వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వచ్చే ఏడాదీ ఈ మెగా ఈవెంట్‌ జరిగే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు జపాన్‌ వైరస్‌ నిపుణులు.

"కరోనా వైరస్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ జరిగేలా కనిపించడం లేదు. రాబోయే వేసవి లోగా జపాన్‌ కరోనాను నియంత్రించొచ్చు. కానీ ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ ఈ వ్యాధి బారి నుంచి బయటపడతాయని చెప్పలేం. ఒలింపిక్స్‌ అంటే అన్ని దేశాలూ పాల్గొనాల్సిన పెద్ద క్రీడా సంబరం."

-కెంటారో ఇవాటా, జపాన్​ ప్రొఫెసర్​

ఇవాటా మాత్రమే కాక ఇటీవల ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ దేవి శ్రీధర్‌.. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేశారు. "కరోనాకు త్వరగా టీకా కనిపెడితే తప్ప ఒలింపిక్స్‌ గురించి ఆలోచించలేం. ఏదైనా ఈ టీకాపైనే ఆధారపడి ఉంది. ఒలింపిక్స్‌ వాయిదా అనేది ఐవోసీకి బాధాకరమే" అని తెలిపారు.

షెడ్యూల్‌ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వచ్చే ఏడాది జులై 23-ఆగస్టు 8 తేదీలకు వాయిదా పడింది.

ఇదీ చూడండి.. బంతి మెరుపు కోసం ఇకపై ఉమ్మేస్తే కుదరదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.