ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ నిరాశపరిచింది. శనివారం జరిగిన 100 మీటర్ల హీట్స్‌లో పోటీ పడిన ఈ అథ్లెట్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 11.48 సెకన్లలో ఈ రేసును పూర్తి చేసి, తన కెరీర్లోనే అత్యంత చెత్త టైమింగ్ నమోదు చేసింది.
ఈ హీట్‌లో జమైకాకు చెందిన ఒలింపిక్ మాజీ విజేత ఎలైన్ థాంప్సన్.. 11.14 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని అగ్రస్థానంలో నిలిచింది. ద్యుతీ 7వ స్థానం సొంతం చేసుకుంది. ఆరు హీట్స్‌లో కలిపి 47 మంది పోటీపడిన ఈ విభాగంలో మొత్తంగా 37వ స్థానం సాధించింది భారత క్రీడాకారిణి. సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే 11.31 సెకన్లలో ఈ రేసును పూర్తి చేయాలి. అయితే ఈ మార్క్‌ను అందులేకపోయింది ద్యుతీ.
ఇదే ట్రాక్‌పై ఏప్రిల్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో, హీట్స్‌లో 11.28 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది ద్యుతీ. సెమీస్‌లో 11.26 సెకన్లలో రేసు పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పింది.
ఇవీ చదవండి: