ETV Bharat / sports

Djokovic Australian Open: జకోవిచ్‌ ఆస్ట్రేలియా వీసా మరోసారి రద్దు - ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022

Djokovic Australian Open: ప్రపంచ నంబర్​వన్​ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ వీసా మరోసారి రద్దు అయ్యింది. వ్యాక్సినేషన్‌ ఆధారాలు చూపనందుకు జకోవిచ్ వీసాను రద్దు చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

Djokovic
జకోవిచ్‌
author img

By

Published : Jan 14, 2022, 1:14 PM IST

Updated : Jan 14, 2022, 5:57 PM IST

Djokovic Australian Open: సెర్బియా టెన్నిస్​ స్టార్​ నొవాక్ జకోవిచ్‌ వీసాను మరోసారి రద్దు చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వ్యాక్సినేషన్‌ ఆధారాలు చూపనందుకు వీసా రద్దు చేశారు అధికారులు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం అనంతరం.. ఓ స్థానిక కోర్టు మరోసారి తీర్పు వెలువరించింది. జకోవిచ్​ను వెంటనే తిరిగివెళ్లమనడానికిలేదని ఆదేశించింది. సెర్బియా స్టార్ తన లాయర్లతో కలిసి శనివారం ఉదయం ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుట హాజరుకావాలని తెలిపింది.

ఇదీ జరిగింది..

Djokovic Visa: తొలుత.. ఆస్ట్రేలియన్ ఓపెన్​లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు జకోవిచ్. సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. దీనిపై తీర్పు వెలువరించింది ఫెడరల్ కోర్టు. ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనేందుకు వచ్చిన ఇతడి వీసాను వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. వెంటనే అతడిని మెల్​బోర్న్ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ఆస్ట్రేలియా సర్కారు మరోసారి జకోవిచ్ వీసాను రద్దు చేయడం గమనార్హం.

ఇవీ చూడండి: కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు

Last Updated : Jan 14, 2022, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.