ETV Bharat / sports

Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్​ - టోక్యో ఒలింపిక్స్​ ప్రేక్షకులు

టోక్యో నగరంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఒలింపిక్స్​కు(Tokyo Olympics) ప్రేక్షకులను అనుమతించట్లేదని ప్రకటించారు నిర్వాహకులు. అంతకుముందే ఆ నగరంలో అత్యయిక స్థితిని విధించారు.

Olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 8, 2021, 7:30 PM IST

టోక్యో నగరంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఒలింపిక్స్(Tokyo Olympics)​ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగాక్రీడలకు ప్రేక్షకులను అనుమతించట్లేదని ప్రకటించారు. వైరస్​ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఒలింపిక్​ మినిస్టర్​ తమయో మరుకవా స్పష్టం చేశారు. టీవీల్లోనే ఈ మెగాక్రీడలను చూడాలని ప్రేక్షకులకు చెప్పారు.

అంతకుముందే అతిథ్య నగరంలో కేసులు అదుపు చేసేందుకు ఆంక్షలను కఠినతరం చేసింది జపాన్​ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే టోక్యోలో అత్యయిక స్థితి విధించింది. విజయోత్సవాలను నిషేధించిన ఆ ప్రభుత్వం మద్యం అమ్మకాలపైనా నిషేధం విధించింది.

ఇదీ చూడండి: Olympics: ఒలింపిక్స్​ ప్రారంభానికి కొద్దిరోజులే.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.