BWF world championship tokyo: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన తొలి రోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్ ఔట్ కాగా, వరుసగా లక్ష్యసేన్, శ్రీకాంత్ లు భారత్‌కు గెలుపొందారు. మహిళల మిక్స్డ్ డబుల్స్‌లో పాల్గొన్న ఇషాన్- తనీష, అశ్విని - సిక్కిరెడ్డిలు విజయం సాధించి తరువాత రౌండ్‌కు అర్హత పొందారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో పాల్గొన్న 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ కాంస్య విజేత సాయి ప్రణీత్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్లో నాల్గవ స్థానంలో ఉన్న చైనీస్ చౌ టియన్ చెన్ చేతిలో 15-21 21-15 15-21 తేడాతో ఓటమి ఎదురైంది. సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ డెన్మార్క్ ప్రత్యర్థి హన్స్-క్రిస్టియన్ సోల్బర్గ్ విట్టింగస్ పై 21-12 21-11 తేడాతో గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో అత్రి- సుమీత్ రెడ్డిలు జపాన్‌కు చెందిన మసయుకి ఒనోడెరా - హిరోకి ఒకమురా చేతిలో 21-11 19-21 21-15 తేడాతో ఓటమి పాలయ్యారు.
కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం పతక విజేతలైన అశ్విని పొన్నప్ప -సిక్కిరెడ్డిలు.. మహిళల డబుల్స్‌లో మాల్దీవులులకు చెందిన అమినాత్ నబియా అబ్దుల్ రజాక్, ఫాతిమాత్ నబాహా అబ్దుల్ రజాక్ల పై 1-7, 21-9 తేడాతో విజయం సాధించారు. మహిళల మిక్స్డ్ డబల్స్‌లో ఇషాన్ భట్నాగర్ - తనీష క్రాష్టోలు జర్మన్‌కు చెందిన పాట్రిక్ స్కీల్ - ఫ్రాంజిస్కా వోల్క్మాన్లపై 21-13 21-13 తేడాతో విజయం సాధించారు.
పురుషుల డబుల్స్‌లో అర్జున్ - కపిల్‌లు థాయిలాండ్‌కు చెందిన సుపక్ జోమ్కోహ్ - కిట్టినుపోంగ్ కేడ్రెన్లపై 21-17 17- 21 22-20 తేడాతో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఆస్ర్టియాకు చెందిన లుకా వాబర్ పై 21-12 21-11 తేడాతో గెలుపొందాడు. పురుషుల సింగిల్స్‌లో కిదంబి శ్రీకాంత్ ఐర్లాండ్ కు చెందిన నహాత్ ఎన్గుయెన్తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో 22-20 21-19 స్వల్ప తేడాతో భారత్ తరపున విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్ చేతిలో మాళవిక 21-14 21-12 తేడాతో పరాజయం పాలైంది.
ఇదీ చూడండి: కోహ్లీఫామ్పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు