ETV Bharat / sports

Australian Open: క్వార్టర్స్​కు నాదల్​, యాష్​ బార్టీ - ఆస్ట్రేలియన్​ ఓపెన్ 2021 యాష్​బార్టీ​ క్వార్టర్​ ఫైనల్స్

Australian Open 2021 Quarterfinals: ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా నేడు(ఆదివారం) జరిగిన పోటీల్లో పలువురు ఆటగాళ్లు క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకున్నారు. వీరిలో నాదల్​, షపొవలోవ్​, యాష్​ బార్టీ, బార్బొరా ఉన్నారు. వీరు క్వార్టర్స్​లో ఎవరితో తలపడనున్నారంటే...

Australian Open 2021 nadal
Australian Open 2021 nadal
author img

By

Published : Jan 23, 2022, 5:15 PM IST

Australian Open 2021 Quarterfinals: ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో నాదల్​(సెర్బియా) జోరు కొనసాగుతోంది. నేడు(ఆదివారం) జరిగిన పోటీల్లో భాగంగా నాలుగో రౌండ్​లో బరిలో దిగి గెలిచిన అతడు క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకున్నాడు. ఈ పోరులో అడ్రియన్​ మన్నారనినోను (Adrian Mannarino) 7-6(14), 6-2,6-2తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో క్వార్టర్స్​కు చేరుకోవడం అతడికిది 14వ సారి.

నాదల్​తో ఢీ

ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​, మూడో సీడ్​ అలెక్సాండర్​ జ్వెరెవ్​కు ఘోర పరాభవం ఎదురైంది. డెనిస్​ షపొవలోవ్‌(Denis Shapovalov) చేతిలో 6-3,7-6(5),6-3 తేడాతో ఓడిపోయాడు. ఫలితంగా కెరీర్​లో తొలిసారి క్వార్టర్​ ఫైనల్స్​కు చేరిన డెనిస్​.. ఈ మ్యాచ్​లో నాదల్​తో తలపడనున్నాడు.

యాష్​ బార్టీ

యాష్​ బార్టీ 6-4,6-3 తేడాతో అమందను(Amanda Anisimova) ఓడించి క్వార్టర్స్​కు చేరింది.

బార్బొరా కూడా

ఫ్రెంచ్​ ఓపెన్​ ఛాంపియన్​ బార్బొరా(Barbora Krejcikova) కూడా కార్టర్స్​కు చేరుకుంది. నేడు జరిగిన నాలుగో రౌండ్​లో విక్టోరియాను(Victoria Azarenka) 6-2,6-2 తేడాతో మట్టికరిపించింది. 85నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్​. బార్బొరా క్వార్టర్స్​లో మడిసన్​ కీస్​తో(Madison Keys) తలపడనుంది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

సయ్యద్​ మోదీ టోర్నీ​ విజేతగా పీవీ సింధు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.