ETV Bharat / sports

Austalian Open 2022: సెమీస్​కు నాదల్​, యాష్​ బార్టీ

Austalian Open 2022: ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో నాదల్​, యాష్​ బార్టీ అదరగొట్టారు. వీరిద్దరూ సెమీస్​కు దూసుకెళ్లారు.

Austalian Open 2022 Nadal Ash barty enters into semi final
సెమీస్​కు నాదల్​, యాష్​బార్టీ
author img

By

Published : Jan 25, 2022, 3:54 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో నాదల్​(సెర్బియా) దూకుడు ప్రదర్శిస్తున్నాడు. నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో భాగంగా క్వార్టర్​ ఫైనల్స్​లో బరిలో దిగి గెలిచిన అతడు సెమీస్​కు చేరుకున్నాడు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ పోరులో డెనిస్​ షపొవలోవ్​ను(Denis Shapovalov) 6-3,6-4,4-6,3-6,6-3 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో సెమీస్​కు చేరడం అతడికిది 7వ సారి కాగా గ్రాండ్​స్లామ్​లో 36వ సారి. ఫైనల్​లో అతడు గెలిస్తే కెరీర్​లో 21వ గ్లాండ్​స్లామ్​​ టైటిల్​ను ముద్దాడి.. పురుషుల సింగిల్స్​లో రోజర్​ ఫెదరర్​(20), జకోవిచ్​ను(20) అధిగమించి అత్యధిక గ్రాండ్​ స్లామ్​ టైటిళ్లను సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.

యాష్​ బార్టీ కూడా జోరు కొనసాగిస్తోంది. క్వార్టర్స్​లో 6-2,6-0 తేడాతో జెస్సికా పెగులాను ఓడించి సెమీ ఫైనల్​కు దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు సాగిందీ పోరు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

మళ్లీ అగ్రస్థానంలోకి షెఫాలీ.. స్మృతి మంధాన డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.