ETV Bharat / sports

Asian Games 2023 Medals List : బోపన్న-రుతుజ జోడీ అదుర్స్​.. టెన్నిస్​లో గోల్డ్​ మెడల్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 1:35 PM IST

Updated : Sep 30, 2023, 2:19 PM IST

Asian Games 2023 Medals List : ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు సంచలనాలు సృషిస్తున్నారు. తాజాగా టెన్నీస్​లో రోహన్‌ బోపన్న, రుతుజా భోసలే పసిడి పతకాన్ని ముద్దాడగా..ఏయిర్​ పిస్టర్​ విభాగంలో భారత జోడీ సరబ్​జోత్​ సింగ్​, దివ్య టీఎస్​ రజత పతకాన్ని సాధించారు.

Asian Games 2023 Medals List
Asian Games 2023 Medals List

Asian Games 2023 Medals List : ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు సంచలనాలు సృషిస్తున్నారు. జరిగే ప్రతి ఈవెంట్​లోనూ ఏదో ఒక మెడల్​ను సాధిస్తున్న ప్లేయర్ల భారత్​ ఖాతాలోకి ఇప్పటి వరకు ఎన్నో పతకాలను సాధించిపెట్టారు. తాజాగా టెన్నిస్​ జోడీ రోహన్‌ బోపన్న, రుతుజా భోసలే పసిడి పతకాన్ని ముద్దాడారు. శనివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్స్​లో ఈ జోడీ చైనీస్‌ తైపీ జోడీ, తొమ్మిదో సీడ్‌ సుంగ్‌-హావో హువాంగ్‌, ఎన్‌-షువో లియాంగ్‌పై 2-6, 6 తేడాతో విజయం సాధించారు.

మరోవైపు 10 మీటర్ల ఏయిర్​ పిస్టర్​ విభాగంలో భారత జోడీ సరబ్​జోత్​ సింగ్​, దివ్య టీఎస్​ రజత పతకాన్ని సాధించారు. గోల్డ్ మెడ‌ల్ కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఫైన‌ల్స్​లో చైనా జోడి 16-14 తేడాతో ఇండియాను బీట్​ చేసి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవసం చేసుకుంది. చైనీస్ షూట‌ర్లు జాంగ్ బోవెన్‌, జియాంగ్ కాంగ్జిన్‌లు త‌మ ఖాతాలో గోల్డ్ మెడ‌ల్ వేసుకున్నారు. ఇప్పటి వరకు షూటింగ్‌లో పతకాల సంఖ్య 19కి చేరుకోగా.. అన్ని గేమ్స్‌ కలిపి మొత్తం టీమ్‌ఇండియా 35 పతకాలను సొంతం చేసుకుంది.

  • A very happy birthday to our shooter Sarabjot Singh. Celebrating with a Silver Medal win today in the 10M Mixed Team Pistol event! 👏🏽👏🏽
    The Chinese Gold Medal winning pair joining in the birthday celebrations!
    Heart to Heart, Future!#IndiaAtAG22 | #WeAreTeamIndia pic.twitter.com/70TAebn9qn

    — Team India (@WeAreTeamIndia) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asian Games 2023 Schedule : పతకాల వేటలో రాణిస్తున్న భారత్‌.. ఇంకొన్ని మెడల్స్​ గెలుచుకునే అవకాశం ఉంది. స్క్వాష్‌లో పాకిస్థాన్‌తో ఫైనల్‌లో టీమ్‌ఇండియా తలపడునుంది. పురుషుల బ్యాడ్మింటన్‌ టీమ్‌ కూడా సెమీఫైనల్‌కు చేరుకుంది. వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను, బాక్సర్‌ లవ్లీనా కూడా ఇప్పటికే తమ పతకాలను ఖాయం చేయగా.. వాటిని గోల్డ్‌గా మలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, టేబుల్ టెన్నిస్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. స్టార్‌ ప్లేయర్ మనికా బాత్రా.. తాజాగా జరిగిన సింగిల్స్‌లో ఓటమిపాలైంది. ఇవాళ సాయంత్రం పురుషుల హాకీలో పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

Asian Games Shooting Medals : శుక్రవారం జరిగిన ఈవెంట్లలో షూటర్లు గోల్డ్‌ మెడల్‌ సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీపొజిషన్స్‌ టీమ్‌(ఎయిర్‌ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్‌తో కూడిన భారత బృందం స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో సిల్వర్‌ మెడల్‌ వచ్చింది. 1731 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఈషా, దివ్య,పాలక్‌తో కూడిన భారత త్రయం సిల్వర్ మెడల్​ను సొంతం చేసుకుంది.

Asian Games 2023 India : భారత్​ ఖాతాలో మరో 'పసిడి'.. మనోళ్ల​ పతకాల వేట కంటిన్యూ

Asian Games 2023 India : ఆసియా క్రీడలు.. భారత్​కు 'బంగారు' పంట.. ఎవరెవరికి వచ్చాయంటే?

Last Updated : Sep 30, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.