కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. తాజాగా 36వ జాతీయ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు భారతీయ ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బత్రా. ఈ క్రీడలు అక్టోబర్-నవంబర్లో గోవాలో జరగాల్సి ఉన్నాయి.
"దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా జాతీయ క్రీడల్ని వాయిదా వేస్తున్నాం. సెప్టెంబర్లో సమావేశం ఏర్పాటు చేసి కొత్త తేదీలను ప్రకటిస్తాం."
-ఐఓఏ
అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 మధ్య జాతీయ క్రీడలను నిర్వహించాలని ఇటీవల గోవా ప్రభుత్వాన్ని కోరింది ఐఓఏ. కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో వాయిదా వేయడమే మంచిదని భావించింది ప్రభుత్వం.