భారత సంతతి అమెరికన్ చిన్నారి అభిమన్యు మిశ్రా అరుదైన ఘనత సాధించాడు. చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. బుడాపెస్ట్‌లో జరిగిన పోటీల్లో గెలిచి, 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల్లో ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో సెర్గీ కర్జాకిన్ నెలకొల్పిన ఘనతను చెరిపేశాడు. సెర్గీ, 12 ఏళ్ల 7 నెలల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.
గతేడాది ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కించుకున్న అభిమన్యు.. తాను పాల్గొన్న ప్రతి పోటీలోనూ గెలుస్తూ, సత్తా చాటాడు. ఏప్రిల్ నుంచి హంగేరీలో ఉన్న అభిమన్యు.. ఆ నెలలో తొలి నార్మ్స్, మేలో రెండో నార్మ్స్ పొందాడు. మూడో నార్మ్స్ కోసం ఇప్పటివరకు ఎదురుచూడాల్సి వచ్చింది.