ఒలింపిక్స్ ప్రారంభానికి గుర్తుగా టోక్యోలో క్రీడా జ్యోతి మార్చి 25న వెలిగింది. అయితే ఈ టార్చ్ రిలే కార్యక్రమంలో షిగెకో కగావా అనే 109 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడు పాల్గొన్నారు. ఒలింపిక్ క్రీడా జ్యోతిలో పాల్గొన్న అతి పెద్ద వయస్కురాలిగా ఈమె రికార్డు సృష్టించారు.
గతంలో ఈ ఘనత బ్రెజిల్‌కు చెందిన ఐదా మెండిస్ పేరిట ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రిలే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె వయసు 107 సంవత్సరాలు. ప్రస్తుతం మెండిస్‌ను కగావా అధిగమించారు.
ఇదీ చదవండి: ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. రిలే షురూ
2021 మార్చి 25న ప్రారంభమైన ఈ క్రీడా జ్యోతి రిలే కార్యక్రమంలో ఇప్పటివరకు ఇద్దరు శతాధిక వయస్కులు పాల్గొన్నారు. 2021 మార్చి 28న టొచిగి పట్టణంలోని నసుకరసుయమా ప్రాంతంలో 104 ఏళ్ల షిత్సుయి హకోయిషి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే కగావా రికార్డు కూడా ఎక్కువ కాలం ఉండేలా లేదు. మే 12న ఈ రిలే కార్యక్రమంలో 117 ఏళ్ల కానె తనాకా పాల్గొననున్నారు. ఈమె ఇప్పటికే జపాన్‌లో అతిపెద్ద వయస్కురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు కూడా సంపాదించారు.
ఇదీ చదవండి: 'మ్యాచ్ ఓడినా మనసులు గెలిచావు సంజు'