అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా రెండోసారి నరీందర్ ధ్రువ్ బాత్రా ఎన్నికయ్యారు. ఎఫ్‌ఐహెచ్‌కు వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు బాత్రానే కావడం విశేషం. 47వ ఎఫ్ఐహెచ్ కాంగ్రెస్‌లో ఈ విషయం వెల్లడైంది.
మొత్తం 124 ఓట్లకు గానూ బాత్రా 63 ఓట్లు దక్కించుకున్నారు. ఆయన బెల్జియం ప్రత్యర్థి మార్క్ కౌడ్రాన్పై విజయం సాధించారు.
ఎఫ్ఐహెచ్లో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, ఆసియన్ హాకీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న బాత్రా.. 2016లో తొలిసారి హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లియాండ్రో నెగ్రేపై మొదటి సారి విజయం సాధించి నాలుగేళ్ల పాటు విజయవంతంగా ఆ పదవీలో ఉన్నారు. తాజా విజయంతో బాత్రా 2024 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
హాకీ ఆడే దేశాల సంఖ్యను పెంచడమే కాకుండా హాకీ చూసే అభిమానుల సంఖ్య పెంచుతానని.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు బాత్రా.
ఇదీ చదవండి: భారత బాక్సర్ల విమానం ల్యాండింగ్‌కు దుబాయ్ నో!