భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు, 1980 మాస్కో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రవీందర్ పాల్ సింగ్ కరోనాతో మృతిచెందారు. దాదాపు రెండు వారాల పాటు లఖ్‌నవూ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన శనివారం కన్నుమూశారు.
ఏప్రిల్ 24న కరోనా సోకడం వల్ల రవీందర్ వివేకానంద ఆసుపత్రిలో చేరారు. అయితే.. గురువారం ఆయనకు నెగెటివ్‌గా తేలిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించినందున ఆయనను వెంటిలెటర్‌పై ఉంచినట్లు పేర్కొన్నారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు స్పష్టం చేశారు.
1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో సింగ్ భారత హాకీ జట్టు తరఫున ఆడారు. ఇవేకాక.. ఛాంపియన్స్ ట్రోఫీ కరాచీ(1980,1983), సిల్వర్ జూబ్లీ 10- నేషన్ కప్ హాంకాంగ్(1983), వరల్డ్ కప్ ముంబయి(1982), ఆసియా కప్ కరాచీ(1982)లో భారత జట్టులో ప్రాతినిథ్యం వహించారు.
ఇదీ చదవండి:'ఐపీఎల్ నిర్వహణకు శ్రీలంక రెడీ'