హాకీ ఇండియాకు ప్రతిష్టాత్మక ఎటియన్నే గ్లిచిచ్ అవార్డు దక్కింది. దేశంలో హాకీ అభివృద్ధికి చేసిన ఎనలేని కృషికి గానూ ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) 47వ కాంగ్రెస్‌లో భాగంగా ఈ అవార్డులను ప్రకటించింది ఎఫ్ఐహెచ్. హాకీ అభివృద్ధిలో భాగమైన వ్యక్తులు, సంస్థలు, బృందాలకు.. ఈ అవార్డును ఇస్తారు.
హాకీలో మౌలిక సదుపాయాల కల్పన, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి చేసిన కృషికి గానూ ఉజ్బెకిస్థాన్‌కు పాబ్లో నెగ్రే అవార్డు వరించింది.
మరికొన్ని అవార్డులు..
- పోలిష్ హాకీ అసోసియేషన్‌కు థియో ఇకెమా అవార్డు లభించింది. హాకీ ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు కొత్తగా 30 మంది కోచ్‌లను నియామకం చేశారు. దీని వల్ల 3000 మంది పాఠశాల పిల్లలు కొత్తగా హాకీకి పరిచయమయ్యారు.
- సూపర్ ఫెయిర్ ప్లే ట్రోఫీ రెనే జి ఫ్రాంక్ అవార్డు.. ఇంగ్లాండ్ స్ట్రైకర్ సామ్ వార్డ్‌కు దక్కింది.
- హాకీలో అంపైరింగ్‌కు పెట్టింది పేరైనా ఐవోనా ముకార్.. ది గస్ట్ లాథోవర్స్ మెమోరియల్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
- సుల్తాన్ అజ్లాన్ షా హకీ అవార్డును న్యూజిలాండ్‌కు చెందిన షారన్ విలియమ్సన్ అందుకున్నాడు. ఆక్లాండ్‌లో కొత్త జాతీయ హాకీ సెంటర్ కోసం ఆయన కృషి చేశాడు.
ఇదీ చదవండి: 'జపాన్‌లో ఎమర్జెన్సీ పెట్టినా.. ఒలింపిక్స్ ఆగదు'