ETV Bharat / sports

జూనియర్ హాకీ ప్రపంచకప్​లో క్వార్టర్స్​కు భారత్ - భారత్-బెల్జియం

Junior Hockey World Cup 2021 India: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత యువ హాకీ జట్టు అదరగొట్టింది. పోలెండ్​ను చిత్తుగా ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

India beat Poland, junior hockey world cup India, జూనియర్ హాకీ ప్రపంచకప్​లో క్వార్టర్స్​కు భారత్, భారత యువ హాకీ జట్టు
India
author img

By

Published : Nov 28, 2021, 6:40 AM IST

Junior Hockey World Cup 2021 India: భారత హాకీ యువ జట్టు అదరగొట్టింది. డ్రా చేసుకున్నా చాలు అనుకున్న మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన యువ భారత్‌.. పోలెండ్‌ను చిత్తుగా ఓడించి సగర్వంగా జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పూల్‌-బి ఆఖరి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ 8-2తో పోలెండ్‌ను చిత్తు చేసింది. వైస్‌ కెప్టెన్‌ సంజయ్‌, అర్జీత్‌ సింగ్‌, సందీప్‌ తలా రెండేసి గోల్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత బృందం.. క్రమం తప్పకుండా గోల్స్‌ చేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి ఎనిమిది నిమిషాల్లోనే మన ఖాతాలో రెండు గోల్స్‌ చేరాయి. ఈ గోల్స్‌ను సంజయ్‌ (4వ నిమిషం), అరిజీత్‌ (8వ ని) కొట్టారు. ఆ తర్వాత కూడా భారత జోరు కొనసాగించింది. సందీప్‌ (24, 40వ నిమిషాలు) రెండు గోల్స్‌ సాధించి భారత్‌ ఆధిక్యాన్ని రెట్టింపు చేయగా.. ఉత్తమ్‌సింగ్‌ (34వ ని), శార్దానంద్‌ (38వ ని) చెరో గోల్‌తో భారత్‌ను 6-0తో మరింత పటిష్ట స్థితికి చేర్చారు. చివరి క్వార్టర్‌లో రటౌస్కీ (50వ ని), రాబర్ట్‌ (54వ ని) చేసిన గోల్స్‌తో పోలెండ్‌ 2-6తో నిలిచినా.. వెంటనే సంజయ్‌ (58వ ని), అరిజీత్‌ (60వ ని) బంతిని గోల్‌పోస్టులోకి పంపి ప్రత్యర్థికి ఆ కాసేపు ఆనందం కూడా లేకుండా చేశారు.

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో 4-5తో ఓడిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో కెనడాను 13-1తో చిత్తు చేసింది. గ్రూప్‌లో ఫ్రాన్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఫ్రాన్స్‌ అగ్రస్థానం సాధించగా.. భారత్‌ రెండో స్థానంతో ముందంజ వేసింది. డిసెంబర్‌ 1న జరిగే క్వార్టర్‌ఫైనల్లో బలమైన బెల్జియంతో భారత్‌ తలపడనుంది.

ఇవీ చూడండి: IND vs NZ Test: అది గుట్కా కాదు బాబు.. స్వీట్ సుపారీ అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.