ETV Bharat / sports

ఫుట్​బాల్​ దిగ్గజం మారడోనా జీవిత విశేషాలు - అర్జెంటీనా ఫుట్​బాల్​ వార్తలు

1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్​ అందించిన డీగో మారడోనా బుధవారం మరణించాడు. తన 60 ఏళ్ల జీవితంలో మారడోనా ఎదుర్కొన్న పరిస్థితులు, సంఘటనలు ఏవో చూద్దాం.

Timeline: Football legend Diego Armando Maradona
ఫుట్​బాల్​ దిగ్గజం మారడోనా జీవిత విశేషాలు
author img

By

Published : Nov 26, 2020, 12:16 PM IST

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా (60) అభిమానులను శోకసంద్రంలో ముంచి మరో లోకానికి చేరుకున్నాడు. అద్భుతమైన ఆటతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేసిన ఈయన.. బుధవారం గుండెపోటుతో మరణించాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన డీగో.. కొకైన్‌ వాడకం, ఊబకాయంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. మెదడుకు శస్త్రచికిత్స తర్వాత రెండు వారాల కిందే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. అయితే అకస్మాత్తుగా మృతి చెందడం వల్ల క్రీడాలోకం సంభ్రమాశ్చర్యానికి గురైంది. అలాంటి దిగ్గజ ఫుట్​బాలర్​ జీవితాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం.

మారడోనా జీవితంలోని కీలక సంఘటనలు:

1960: అర్జెంటీనాలోని లానస్​లో 1960 అక్టోబరు 30న జన్మించాడు.

1970:​ లాస్ సెబోలిటాస్ యువ జట్టులో చేరాడు.

1971: 11 ఏళ్ల వయసులో అర్జెంటీనా జూనియర్​ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

1976: 15 ఏళ్లకే ప్రొఫెషనల్​ ప్లేయర్​గా మారి అర్జెంటీనా జూనియర్​ జట్టులో అరంగేట్రం చేశాడు.

1977: 16 ఏళ్ల వయసుకే అర్జెంటీనా జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్​లో భాగమయ్యాడు.

1978: అర్జెంటీనా జాతీయ జట్టుకు ఎంపికైన అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు.

1979: మారడోనా తొలి అంతర్జాతీయ గోల్​ చేయడం సహా ఇదే ఏడాది జూనియర్​ ప్రపంచకప్​ విజేతగా అర్జెంటీనా నిలిచింది.

1980: స్పానిష్​ లీగ్​లో బార్సిలోనా జట్టు మారడోనాతో ఒప్పందం కుదుర్చకుంది.

1981: రూ.14.47 కోట్లతో అర్జెంటీనాకు చెందిన బోకా జూనియర్స్​ జట్టు మారడోనాను సొంతం చేసుకుంది.

1982: అర్జెంటీనా జట్టు తరపున మొదటి ఫిఫా ప్రపంచకప్​ ఆడి రెండు గోల్స్​ చేశాడు. ఆ తర్వాత రూ. 72.44 కోట్లతో బార్సిలోనా ఎఫ్​సీ ఒప్పందానికి సంతకం చేశాడు. అప్పట్లో అది ప్రపంచ రికార్డు.

1983: స్పానిష్​ లీగ్​లో బార్సిలోనా జట్టు విజయం సాధించడానికి సహకరించాడు.

1984: రూ. 99.98 కోట్లకు బార్సిలోనా క్లబ్​ నుంచి నాపోలీ క్లబ్​ మారడోనాను సొంతం చేసుకుంది. ఇది మరో రికార్డు.

1986: అర్జెంటీనా ఫుట్​బాల్​ జట్టుకు కెప్టెన్​గా ప్రపంచకప్​ గెలిపించాడు. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో రెండు గోల్స్​ చేశాడు. అందులో ఒకటి 'శతాబ్దపు గోల్​'గా ఫిఫా 2002లో గుర్తించింది.

1987: నాపోలీకి తొలి ఇటాలియన్​ టైటిల్​ గెలవడానికి సహాయపడ్డాడు.

1989: క్లావ్​డియా విల్లాఫేన్​ను వివాహమాడాడు.

1990: ప్రపంచకప్​ ఫైనల్లో పశ్చిమ​ జర్మనీ చేతిలో ఓడిపోయిన తర్వాత పితృత్వ దావాను ఎదుర్కొన్నాడు.

1991: కొకైన్​ సేవించడం వల్ల డ్రగ్స్​ టెస్ట్​లో విఫలమవ్వడం వల్ల 15 నెలల సస్పెన్షన్​కు గురయ్యాడు.

1992: స్పానిష్​ లీగ్​లో సెవిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

1993: సెవిల్లాతో విభేదించిన తర్వాత.. న్యూవెల్​కు చెందిన ఓల్డ్​ బాయ్స్​లో చేరాడు.

1994: ఎఫెడ్రిన్​ రుగ్మతకు గురై అమెరికాలో జరిగిన ప్రపంచకప్​ నుంచి వైదొలగాడు.

1995: బోకా జూనియర్స్​లో చివరి సీజన్​ ఆడాడు.

1996: డ్రగ్స్​ వ్యసనంపై వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.

1997: మరోసారి డ్రగ్స్​ సేవించినట్లు తేలిన తర్వాత 37 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్​ కెరీర్​కు వీడ్కోలు పలికాడు.

2000: 'యో సోయ్ ఎల్ డియాగో' పేరుతో మారడోనా ఆత్మకథ పుస్తకం రాశారు. ఇదే ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన బుక్​గా అది నిలిచింది. రెండేళ్లపాటు క్యూబాలో ఉన్నాడు. గుండెపోటు గురయ్యాడు.

2002: డ్రగ్స్​ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి క్యూబా వెళ్లాడు.

2004: గుండెపోటుతో మరోసారి ఆస్పత్రిలో చేరాడు.

2005: టాక్​షో ను నిర్వహించి మొదటి అతిథిగా పీలేను ఇంటర్వ్యూ చేశాడు.

2008: అర్జెంటీనా జాతీయ ఫుట్​బాల్​ జట్టుకు ప్రధానకోచ్​గా నియమితుడయ్యాడు. 18 నెలలపాటు (2010 ప్రపంచకప్​ వరకు) ఈ పదవిలో కొనసాగాడు. భారత్​ను సందర్శించి, కోల్​కతాలో ఇండియన్​ ఫుట్​బాల్​ స్కూల్​ను ప్రారంభించాడు.

2013: అర్జెంటీనా ప్రైమెరా డీ క్లబ్​ డిపోర్టివో రిస్టాలో 'ఆధ్యాత్మిక కోచ్'​గా చేరాడు.

2017: మరోసారి భారత్​ను సందర్శించి, కోల్​కతాలో ఫుట్​బాల్​ ఆడాడు.

2018: ఈ ఏడాది ప్రపంచకప్​లో నైజీరియా, అర్జెంటీనా మ్యాచ్​కు హాజరయ్యాడు. ఆ మ్యాచ్​ తర్వాత అనారోగ్య సమస్య తలెత్తింది.

2019: అర్జెంటీనా క్లబ్ గిమ్నాసియా డి లా ప్లాటాకు ప్రధానకోచ్​గా ఎంపికయ్యాడు.

2020: బ్యూనస్​ ఎయిర్స్​లోని ఒలివోస్​ క్లినిక్​లో మెదడులో రక్తం గడ్డకట్టినందుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. నవంబరు 25న మరణించాడు.

ఇదీ చూడండి... ఫుట్​బాల్​ దిగ్గజం మారడోనా కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.