ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. తనపై అత్యాచారం చేసినందుకుగానూ పరిహారంగా సుమారు రూ.579 కోట్లు (56.5 మిలియన్ పౌండ్లు) ఇవ్వాలని మాజీ మోడల్ కేథరిన్ మయోర్గా డిమాండ్ చేసినట్లు సమాచారం. 2009లో లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్ ఆరోపించింది. అయితే ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవడం కోసం 2010లో ఆమె దాదాపు రూ.2.76 కోట్లు తీసుకునేందుకు ఒప్పుకుంది. కానీ తాజాగా భారీ మొత్తాన్ని పరిహారంగా ఇవ్వాలని అడుగుతోంది.
"గతంలో తాను అనుభవించిన క్షోభకు, భవిష్యత్‌లో ఎదుర్కోబోయే బాధకు, అన్ని ఖర్చులకు కలిపి 56.5 మిలియన్ పౌండ్లు పరిహారంగా ఇవ్వాలని 37 ఏళ్ల కేథరిన్ డిమాండ్ చేసింది. అది రొనాల్డో రెండేళ్ల జీతానికి సమానం" అని ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఆమె చేసిన ఆరోపణలను రొనాల్డో గతంలోనే ఖండించాడు.
ఇవీ చదవండి: దిగ్గజ షూటర్ చంద్రో తోమర్ ఘనతలెన్నో!