ETV Bharat / sports

'మెస్సీ వస్తే వద్దంటామా.. అతడొస్తే సంతోషమే'

ఫుట్​బాల్ స్టార్ లియోనల్​ మెస్సీ బార్సిలోనా క్లబ్​ను వదులుకోవాలని నిర్ణయిస్తే అతడికి పారిస్​ క్లబ్​ స్వాగతం పలుకుతుందని ఆ జట్టు మేనేజర్​ థామస్​ తుచెల్​ వెల్లడించాడు. పారిస్​ సెయింట్​ క్లబ్​లో ప్రస్తుతం కొంతమంది ఆటగాళ్లు దూరమవుతున్న కారణంగా బదిలీ విండో ద్వారా కొత్త ఆటగాళ్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.

Messi would be 'welcome' at PSG, says Tuchel
'మెస్సీ బార్సిలోనాను వదిలేస్తే మా క్లబ్​లో చేరొచ్చు'
author img

By

Published : Aug 24, 2020, 1:09 PM IST

Updated : Aug 24, 2020, 1:28 PM IST

ఫుట్​బాల్​ స్టార్​ ప్లేయర్​ లియోనల్​ మెస్సీ బార్సిలోనా క్లబ్​ నుంచి వైదొలగాలనుకుంటే తమ క్లబ్ అతడికి​ స్వాగతం పలుకుతుందని అన్నాడు పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్​ మేనేజర్​ థామస్​ తుచెల్​. అయితే మెస్సీని క్లబ్​లోకి చేర్చుకోవడానికి అర్జెంటీనా ముందుకొస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపాడు.

"మెస్సీకి మా క్లబ్​ స్వాగతం పలుకుతుంది. బార్సిలోనా క్లబ్​లో మెస్సీ తన కెరీర్​ను ముగించాడని భావిస్తున్నా. అతడు మిస్టర్​ బార్సిలోనా. మా క్లబ్​లో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లను కోల్పోయాం. థియాగో సిల్వా, ఎరిక్​ మాగ్జిమ్​, చౌపో-మోటింగ్​ వంటి ఆటగాళ్లనూ త్వరలో కోల్పోతాం. ఇప్పుడు జట్టును బల పరచుకోవడానికి ఆటగాళ్ల బదిలీ విండోను ఉపయోగించాలి."

- థామస్​ తుచెల్​, పారిస్​ సెయింట్​ జర్మైన్​ మేనేజర్​

ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ లీగ్​ క్వార్టర్​ ఫైనల్స్​లో బాయర్న్​ మ్యూనిక్​ క్లబ్​పై 8-2 పాయింట్ల తేడాతో బార్సిలోనా ఓటమి పాలైంది. దీంతో కొన్ని స్పానిష్​ మీడియా సంస్థలు క్లబ్​లో మెస్సీ భవిష్యత్​పై సందేహాలు వ్యక్తం చేశాయి. ఆదివారం జరిగిన ఛాంపియన్స్​ లీగ్​ ఫైనల్​ బాయర్న్​పై 1-0 తేడాతో పారిస్​ సెయింట్​ జర్మైన్​ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు మార్చిలో జరగాల్సిన ఫ్రెంచ్​ లీగ్​ 2019-20 తొలి సీజన్​ ప్రారంభం కావాల్సింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా టోర్నీ వాయిదా పడింది.

13 ఏళ్ల వయసులోనే బార్సిలోనాలో చేరిన మెస్సీ.. ఆ క్లబ్​ కోసం ఆడిన 730 మ్యాచ్​ల్లో రికార్డు స్థాయిలో 634 గోల్స్​ చేశాడు. 33 ట్రోఫీలను క్లబ్​కు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. 33 ఏళ్ల వయసున్న మెస్సీ.. బార్సిలోనా క్లబ్​ ఒప్పందానికి ఇదే చివరి ఏడాది.

Last Updated : Aug 24, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.