మాంచెస్టర్‌లోని ఎల్లాండ్ ఫుట్‌బాల్ స్టేడియంలో ఒసామా బిన్ లాడెన్ ప్రత్యక్షమయ్యాడు. అదేంటి అతడు ఎప్పుడో చనిపోయాడు కదా? మళ్లీ కనిపించడం ఏంటని అనుకుంటున్నారా? మరేం లేదు. కరోనా ప్రభావంతో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించని నేపథ్యంలో వారి కటౌట్లు పెట్టాలని ప్రీమియర్ ఫుట్‌బాల్ లీగ్ నిర్వహకులు భావించారు. ఈ క్రమంలోనే అభిమానుల ఫొటోల్ని పంపమని కోరారు. దీంతో ఓ వ్యక్తి ఏకంగా బిన్ లాడెన్ చిత్రం పంపగా, దానిని స్టాండ్స్‌లో పెట్టారు.
దీనిని ఒకతను ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన లీడ్స్ యునైటెడ్ అధికారులు.. బిన్ లాడెన్ కార్డ్ బోర్డును తొలగించారు. ఇటువంటి అభ్యంతరకర చిత్రాలేవీ ఇక లేవని స్పష్టం చేశారు.
-
(The one who put this cut out was really dumb he didn't even realized 😂)
— Ammara Bari (@AmmaraBari) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Someone submitted a picture of Osama Bin Laden as their cut out fan at Leeds and they put it up 😂😭😂 #OsamaBinLaden pic.twitter.com/6QZ2wDw9Uv
">(The one who put this cut out was really dumb he didn't even realized 😂)
— Ammara Bari (@AmmaraBari) June 25, 2020
Someone submitted a picture of Osama Bin Laden as their cut out fan at Leeds and they put it up 😂😭😂 #OsamaBinLaden pic.twitter.com/6QZ2wDw9Uv(The one who put this cut out was really dumb he didn't even realized 😂)
— Ammara Bari (@AmmaraBari) June 25, 2020
Someone submitted a picture of Osama Bin Laden as their cut out fan at Leeds and they put it up 😂😭😂 #OsamaBinLaden pic.twitter.com/6QZ2wDw9Uv
లాక్డౌన్ వల్ల ఆంక్షలతో కూడిన అనుమతులతో అభిమానులు లేకుండానే ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అభిమానులు స్టేడియంలో కనిపించేలా లీడ్స్ యునైటెడ్ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. స్టాండ్స్‌లో వారి కటౌట్ కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అభిమాని సైన్ అప్ చేసుకొని, 25 డాలర్లు చెల్లించాలి. అనంతరం వారి కటౌట్‌ను ఎల్లాండ్ స్టేడియంలో ఉంచుతారు.
ఇదీ చూడండి:వికెట్ పడిన ప్రతిసారీ ఎగిరి గంతులేశాం: సచిన్