ETV Bharat / sports

చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా, నిజమెంత - rumors of chahal dhanashree divorcee

టీమ్​ఇండియా క్రికెటర్​ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ధనశ్రీ చేసిన ఓ పని ఆ అనుమానాలకు తావిచ్చింది. అయితే, దీనిపై చాహల్ వివరణ ఇచ్చాడు.

DHANASHRI CHAHAL
DHANASHRI CHAHAL
author img

By

Published : Aug 18, 2022, 5:50 PM IST

సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయేముందు లేదా విడాకులు తీసుకునేముందు సోషల్ మీడియాలో ఇంటిపేరును తొలగించడం ట్రెండ్​ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ధనశ్రీ కూడా తన పేరులో చాహల్ పదాన్ని తొలగించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన సోషల్​మీడియా ఖాతా పేరు ఇంతకుముందు ధన్‌శ్రీ చాహల్ అని ఉండేది. అయితే ఇప్పుడు అందులో నుంచి చాహల్​ పేరును తొలగించి ధనశ్రీ వర్మ అని పెట్టుకుంది. దీంతో ఒకప్పుడు తమ రొమాంటిక్ చిత్రాలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ జోడీ.. తాజాగా సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది.

DHANASHRI CHAHAL
చాహల్- ధనశ్రీ

మరోవైపు, చాహల్ కూడా ఇటీవలే సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్ట్ కూడా వైరల్​ అయింది. 'కొత్త జీవితం లోడ్ అవుతోంది' అంటూ ఇన్‌స్టా రీల్‌లో ఓ ఫొటోను పంచుకున్నాడు చాహల్. ఇవన్నీ చూస్తుంటే చాహల్​ ధనశ్రీ బంధానికి బ్రేకులు పడ్డాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, ఓ కోర్టులో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేశారని ట్వీట్లు చేశారు.

DHANASHRI CHAHAL
ధనశ్రీ, చాహల్

చాహల్ క్లారిటీ
అయితే, ఈ ప్రచారాలు శ్రుతిమించిన నేపథ్యంలో చాహల్ స్పష్టతనిచ్చాడు. ఇన్​స్టాగ్రామ్​లో ఓ స్టేటస్ పెట్టాడు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న రూమర్స్​ను ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నాడు. వీటన్నింటికీ ఫుల్​స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశాడు.

DHANASHRI CHAHAL
చాహల్ ఇన్​స్టా స్టోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.