ETV Bharat / sports

'ఇప్పుడైనా నవ్వు బాబు'.. గంభీర్​కు యూవీ పంచ్

author img

By

Published : Jul 29, 2021, 7:06 PM IST

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్​ పెట్టిన ఓ పోస్ట్​కు ఫన్నీ కామెంట్​ చేశాడు యువరాజ్​. 'కనీసం ఫొటోలైనా నవ్వొచ్చు కదా' అంటూ వ్యంగాస్త్రం విసిరాడు.

Gambhir
గంభీర్​

ఒక్కోసారి అంతే.. సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టిన ఫొటో కన్నా కింద కామెంట్‌ సెక్షన్లలో పెట్టే కామెంట్లే వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వివాదాలకు దారి తీస్తే.. మరికొన్ని నవ్విస్తాయి. అంతే కాదు.. దీనిపై నెటిజన్ల చర్చలూ కొనసాగుంటాయి. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో తెల్ల దుస్తులు ధరించి.. సముద్రం దగ్గర నిలబడి స్టైల్‌గా పోజిచ్చాడు. 'నీలా ఎవరూ ఉండలేరు.. అదే నీ ప్రత్యేకత!!' అని క్యాప్షన్‌ని జత చేశాడు. అంతే.. ఆ ఫొటో చూసిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వెంటనే తన కామెంట్‌తో గౌతమ్‌పై పంచ్‌ విసిరాడు.

గంభీర్‌ క్రికెట్‌ మైదానంలోనే కాదు.. బయటా చాలా సింపుల్‌గా.. ఎలాంటి హడావుడి చేయకుండా ఉంటాడు. ఆయన ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్లు ఎక్కువగా కనిపించవు. ఆ ఫొటోలోనూ ఇదే గమనించిన యూవీ " మిత్రమా.. కనీసం ఫొటోలోనైనా నవ్వొచ్చుగా" అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. గతంలో గౌతమ్‌ ఫీల్డింగ్ చేసిన ఫొటోకి.. "‘క్యాచ్‌ అయితే పట్టుకోలేకపోయా కానీ.. కెమెరా చక్కటి ఎక్స్‌ప్రెషన్‌ను బంధించింది" అంటూ క్యాప్షన్‌ పెడితే.. వెంటనే హర్భజన్‌ సింగ్‌ "నీ ఎక్స్‌ప్రెషన్‌కి బౌలర్‌ ఎలా స్పందించి ఉంటాడో చూడాల్సిందే" అంటూ కామెంట్‌ చేశాడు. ఏదేమైనా గౌతమ్‌ గంభీర్‌ ఫొటోలకు టీమ్‌ ఇండియా ఆటగాళ్ల కామెంట్లతో నవ్వుల తెప్పించే హాస్యాన్ని పండిస్తున్నారు.

ఇదీ చూడండి:- T20 WorldCup: 'ఆ బాధ్యత కోహ్లీ, రోహిత్​దే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.