WTC Final 2023 : భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటేనే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు, కవ్వింపు చర్యలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఫైనల్ రెండో రోజు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఆసీస్ ఆటగాళ్లకు కౌంటర్లు ఇస్తున్నాడు. రెండో రోజు తొలి సెషన్ మొదటి ఓవర్‌లో సిరాజ్ కోపంతో బంతిని స్ట్రైకర్ వికెట్లపైకి విసిరాడు. ఎందుకంటే?
ఓవర్ నైట్ స్కోర్ 95 వద్ద ఉన్న స్టీవ్ స్మిత్ వరుస బౌండరీలతో సెంచరీకి చేరువయ్యాడు. అయితే.. తర్వాత బంతి వేసేందుకు సిరాజ్ బౌలింగ్ ఎండ్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. తీరా బంతి విసిరే సమయానికి స్మిత్ క్రీజు నుంచి పక్కకు జరిగాడు. స్పైడర్ కెమెరా అడ్డంగా వచ్చిందని చెప్పి అతడు సిగ్నల్ ఇస్తూ సైడ్‌కు జరిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సిరాజ్ బంతిని వికెట్లపైకి విసిరేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇద్దరు సైలెంట్ కావడంతో ఎలాంటి మాటల యుద్దం జరగలేదు. చివరకు శార్దూల్ ఠాకూర్.. స్టీవ్ స్మిత్(121)ను పెవిలియన్‌కు పంపాడు.
-
Siraj got no chill pic.twitter.com/ui4DyobB70
— W. (@CFCstorm_) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Siraj got no chill pic.twitter.com/ui4DyobB70
— W. (@CFCstorm_) June 8, 2023Siraj got no chill pic.twitter.com/ui4DyobB70
— W. (@CFCstorm_) June 8, 2023
-
India get the big wicket of Steve Smith and it's the golden arm of Shardul Thakur that works its magic ✨
— ICC (@ICC) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/nWArZgBhb1
">India get the big wicket of Steve Smith and it's the golden arm of Shardul Thakur that works its magic ✨
— ICC (@ICC) June 8, 2023
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/nWArZgBhb1India get the big wicket of Steve Smith and it's the golden arm of Shardul Thakur that works its magic ✨
— ICC (@ICC) June 8, 2023
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/nWArZgBhb1
హెడ్ జోరుకు సిరాజ్ బ్రేక్
WTC Final 2023 Siraj : అయితే 327/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు జోరునే కొనసాగించింది. తొలి ఓవర్‌లోనే స్మిత్ వరుసగా రెండు బౌండరీలు బాది 229 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ 164 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. వేగంగా పరుగులు రాబట్టిన ఆసీస్ 350 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే షార్ట్ పిచ్ బాల్‌తో ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. ట్రావిస్ హెడ్ ఔటవ్వడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు.
-
First wicket on Day 1 ✅
— ICC (@ICC) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
First wicket on Day 2 ✅
Mohammed Siraj 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/Wz6kve1TZb
">First wicket on Day 1 ✅
— ICC (@ICC) June 8, 2023
First wicket on Day 2 ✅
Mohammed Siraj 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/Wz6kve1TZbFirst wicket on Day 1 ✅
— ICC (@ICC) June 8, 2023
First wicket on Day 2 ✅
Mohammed Siraj 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/Wz6kve1TZb
తెలంగాణోడు బౌలింగ్.. ఆంధ్ర కీపర్ క్యాచ్
అయితే ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన సిరాజ్‌పై అభిమానులు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడని, సిరాజ్‌లా ఇతర బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే ఔట్ చేయవచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆరంభంలో వికెట్ తీయడాన్ని మియా భాయ్ కొనసాగిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్‌ను ఔట్ చేయడం ఆషామాషీ వ్యవహరం కాదని, సిరాజ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనంటున్నారు. తెలంగాణోడు బౌలింగ్ వేస్తే.. ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ క్యాచ్ పట్టాడని, తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లే అద్భుతంగా రాణిస్తున్నారని సెటైరికల్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు.
స్టీవ్ స్మిత్ సెంచరీలు.. ఎన్నో రికార్డులు..
WTC Final 2023 Steve Smith : ఈ మ్యాచ్‌లో తొలి రోజు ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించగా.. రెండో రోజు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. సిరాజ్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది స్మిత్ కెరీర్‌లో 31వ శతకాన్ని సాధించాడు.
-
Steve Smith loves batting at The Oval 😍
— ICC (@ICC) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Third century at the ground for the Aussie star ⭐
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/jnZP7Z757F
">Steve Smith loves batting at The Oval 😍
— ICC (@ICC) June 8, 2023
Third century at the ground for the Aussie star ⭐
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/jnZP7Z757FSteve Smith loves batting at The Oval 😍
— ICC (@ICC) June 8, 2023
Third century at the ground for the Aussie star ⭐
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/jnZP7Z757F
- ఇంగ్లాండ్ గడ్డపై స్మిత్‌కు ఇది 7వ సెంచరీ
- ఆస్ట్రేలియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానం. రికీ పాంటింగ్ (41), స్టీవ్ వా (32) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- టీమ్ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్‌తో పాటు అగ్రస్థానం. రూట్, స్మిత్‌లు ఇద్దరు టీమిండియాపై 9 శతకాలు బాదారు.
- పర్యటక జట్టు తరఫున ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ వాతో పాటు రెండో స్థానం. స్టీవ్ వా, స్మిత్‌లు ఇద్దరు చెరో 7 సెంచరీలు చేయగా.. టాప్‌లో సర్ డాన్ బ్రాడ్‌మన్ (11) ఉన్నారు.
- పర్యటక జట్టు తరఫున ఇంగ్లాండ్‌లోని ఓ వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానం. స్టీవ్ స్మిత్ ఓవల్ మైదానంలో 3 సెంచరీలు చేశాడు. డాన్ బ్రాడ్‌మన్ హెడింగ్లేలో అత్యధికంగా 4 సెంచరీలు, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 3 సెంచరీలు చేశాడు. భారత్ తరఫున దిలీప్ వెంగ్‌సర్కార్ లార్డ్స్‌లో 3 సెంచరీలు చేశాడు.
- భారత్-ఆస్ట్రేలియా మధ్యలో టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం (9). ఈ జాబితాలో సచిన్ (11) టాప్‌లో ఉన్నాడు.
-
Steve Smith's love affair with India continues 😮
— ICC (@ICC) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/inQo39ZaoD
">Steve Smith's love affair with India continues 😮
— ICC (@ICC) June 8, 2023
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/inQo39ZaoDSteve Smith's love affair with India continues 😮
— ICC (@ICC) June 8, 2023
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/inQo39ZaoD
-
- ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో కనీసం 2 సెంచరీలు చేసిన ఏడో ఆటగాడు. గంగూలీ (3), పాంటింగ్ (3), సయీద్ అన్వర్ (3), జయవర్దనే (2), రోహిత్ శర్మ (2), వాట్సన్ (2) స్టీవ్ స్మిత్ కంటే ముందున్నారు.