ETV Bharat / sports

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండోసారి ఫెయిల్​.. భారత్​ ఓటమికి కారణాలు ఇవేనా? - డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 భారత్​ ఓటమికి కారణాలు

WTC Final 2023 Winner : ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో.. టీమ్​ఇండియా ఘోర పరాభవం మూడగట్టుకుంది. వరుసగా రెండో సారి ఫైనల్​ విఫలమైంది. అయితే, భారత్​ ఓడిపోడానికి కారణాలేంటో ఒకసారి చూద్దాం..

wtc final 2023 india lose reasons
wtc final 2023 india lose reasons
author img

By

Published : Jun 11, 2023, 7:16 PM IST

WTC Final 2023 Winner : టెస్టు క్రికెట్​కు పూర్వవైభవం తీసుకురావాలని 2019లో వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​నకు శ్రీకారం చుట్టింది ఐసీసీ. అందులో భాగంగా పాయింట్స్​ టేబుల్​లో టాప్​ 2 స్థానాల్లో ఉన్న టీమ్​లు డబ్ల్యూటీసీ ఫైనల్​ ఆడతాయి. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడమే చాలా కష్టం. వివిధ దేశాలతో పోటీ పడి మరీ టాప్‌లో నిలవాలి. అలాంటిది వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరిన భారత జట్టు మాత్రం ఛాంపియన్‌గా నిలవడంలో విఫలం అయింది. అభిమానులను నిరాశకు గరించేసింది. అయితే, ప్రతిష్టాత్మక టెస్టు గదను దక్కించుకోవాలంటే అన్ని విభాగాల్లో రాణించాలి. కానీ టీమ్​ఇండియా ఆసీస్‌పై తేలిపోయింది. అయితే, భారత్​ ఓడిపోడానికి కారణాలేంటో ఒకసారి చూద్దాం..

కారణాలివే..!

  • అది మొదటి తప్పు.. ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్‌కు అనుకూలమైనవి. దీనిపై సందేహం లేదు. కానీ, స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని.. పిచ్‌ను పరిశీలించిన విశ్లేషకులు అంచనా వేశారు. టీమ్ఇండియా జట్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా లేడు. కేవలం రవీంద్ర జడేజాతోనే బరిలోకి దిగాం. అశ్విన్ జట్టులో ఉంటే తన వైవిధ్యమైన బౌలింగ్‌తో మార్పు తెచ్చేవాడేమో. ఆస్ట్రేలియాపై, డబ్ల్యూటీసీ సీజన్‌లలో కూడా అత్యధిక వికెట్లు తీసిన, బ్యాటింగ్‌లోనూ నిలదొక్కుకునే సత్తా ఉన్న అశ్విన్‌కు ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు.
  • పేసర్లు రివర్స్.. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు తొలి సెషన్ మినహా ఏమీ కలిసి రాలేదు. పిచ్​ పేస్‌కు అనుకూలించినా.. మన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. షమీ, సిరాజ్ వికెట్లు తీసినా.. భారీ పరుగులు ఇచ్చారు. బౌన్సీ పిచ్‌లపై రాణిస్తాడని భావించిన ఉమేష్ యాదవ్.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు పడగొట్టినప్పటికీ.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఫుల్ లెంత్​ బంతులు వేస్తే బ్యాటర్​కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే వారు అస్సలు పట్టించుకోలేదని మాజీ ఆటగాడు చెప్పాడు. సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. కానీ, అలాంటి బంతులను నిలకడగా వేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
  • మీరు ఇంకా ఆ మూడ్‌లోనే ఉన్నారా.. అజింక్య రహానే తప్ప, భారత బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. గిల్, కోహ్లీ, రోహిత్ ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చారు. ఆ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేదని తెలుస్తోంది. క్రీజులో పాతుకుపోయి ఆడడంలో విఫలమయ్యారు. వీరంతా స్టార్ ప్లేయర్లే అయినప్పటికీ టీ20 ఫార్మాట్ నుంచి లాంగ్ ఫార్మాట్​కు అలవాటు పడకపోవడం మ్యాచ్​పై తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ వందల పరుగులు చేసిన వారు ఇక్కడ వంద నిమిషాలు కూడా క్రీజులో నిలవలేకపోయారు.
  • తేలిపోయిన పుజారా.. ఇంగ్లండ్‌లో గత కొన్ని రోజులుగా కౌంటీ తరఫున ఆడిన పుజారా అసలు మ్యాచ్‌కి రావడం వల్ల తేలిపోయాడు. చాలా రోజులుగా టెస్టులకు దూరంగా ఉన్న రహానే.. పుజారా కంటే కీలక ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. అందరికీ మార్గదర్శకంగా ఉండి సహచరులకు విలువైన సూచనలు అందించాల్సిన పుజారా వైఫల్యం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా భావించవచ్చు. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కనీసం వార్మప్​ మ్యాచ్‌లను ఏర్పాటు చేయలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • మాటల్లోనే దూకుడు.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ అటాక్‌కు దిగినప్పుడు ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడం కూడా మనం చూశాం. అయితే ఆసీస్ బ్యాటర్లను రెచ్చగొట్టిన అతడి చర్యలు భారత్​ను కాపాడలేకపోయాయి. సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 188 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఓ వైపు ఆస్ట్రేలియా బౌలర్లు నిశ్శబ్దంగా వికెట్లు తీసి తమ జట్టును గెలిపించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 125/5తో నిలిచింది
  • అంపైర్ నిర్ణయం.. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో పాటు అంపైర్ల నిర్ణయాలు కూడా భారత్ ఓటమికి కారణమనే వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా భారీ లక్ష్య ఛేదనలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు గిల్ అవుట్ కావడం వల్ల భారత్ ఒత్తిడిలో పడింది.
  • ఇవీ చదవండి :
  • WTC Final 2023 : భారత్​కు మళ్లీ నిరాశే.. డబ్ల్యూటీసీ విజేతగా ఆస్ట్రేలియా
  • గిల్‌ ఔట్​తో మళ్లీ తెరపైకి 'సాఫ్ట్‌ సిగ్నల్‌'.. అంటే ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.