టీమ్ఇండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహాకు మరోసారి జరిపిన పరీక్షల్లోనూ కొవిడ్ నిర్ధరణ అయింది. ఐపీఎల్ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్.. రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయినప్పటికీ.. రెండోసారి నిర్వహించిన టెస్ట్‌లోనూ అతనికి వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో సాహా దిల్లీలోని హోటల్ గదికే పరిమితమయ్యాడు. త్వరలోనే మరో విడత పరీక్షలు చేయనున్నారు. సోమవారం నాటికి క్వారంటైన్ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో సాహాకు చోటు కల్పించింది బీసీసీఐ. ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగించే విషయమే. జూన్ 2న భారత జట్టు ఇంగ్లాండ్ బయల్దేరనుంది. ఆ సమయానికి సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే.. డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో ఆడతాడు!
ఇదీ చదవండి: 'టీకా షాట్ తీసుకుందాం.. కరోనాను ఔట్ చేద్దాం'