ETV Bharat / sports

వరల్డ్​కప్​లో టీమ్​ఇండియాకు షాక్​.. రెండో మ్యాచ్​లో ఓటమి - టీమ్​ఇండియా మహిళలు ఓటమి

Worldcup 2022 Ind vs Nz: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​ విజయాన్ని అందుకుంది. 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.

worldcup
ప్రపంచకప్​
author img

By

Published : Mar 10, 2022, 1:55 PM IST

Updated : Mar 10, 2022, 3:01 PM IST

Worldcup 2022 Ind vs Nz: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్​ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 46.4ఓవర్లలో 198 పరుగుల చేసి ఆలౌట్​ అయింది. హర్మన్​ప్రీత్​ కౌర్​(71) రాణించినా ఫలితం లేకపోయింది. మిథాలీ రాజ్​(31), యస్తికా భాటియా(28) నామమాత్రంగా ఆడగా.. మిగతా వారు విఫలమయ్యారు. కివీస్​ బౌలర్లలో లి తహుహు, అమెలియా కెర్​ తలో మూడు వికెట్లు తీయగా.. హెలే జెన్సన్​ 2, జెస్​ కెర్​, హన్నా రో ఓ వికెట్​ను దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్​ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల మెరుగైన స్కోర్‌ సాధించింది. అమీ సత్తర్​వైట్​(75), అమెలియా కెర్​(50), కెటీ మార్టిన్​(41), సోఫీ డివైన్​(35) బాగా రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్​ 4, రాజేశ్వరి గైక్వాడ్​ 2, ఝులన్​ గోస్వామి ఓ వికెట్​ తీశారు.

ఇదీ చూడండి: న్యూజిలాండ్ ధనాధన్​ బ్యాటింగ్​​.. భారత్​ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Mar 10, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.