టీమ్ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్ హనుమ విహారి.. రంజీట్రోఫీలో ఈసారి హైదరాబాద్ జట్టు(Hanuma Vihari Ranji Team) తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసీని(నిరభ్యంతర పత్రం) పొందాడు. ఇదే విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి.దుర్గాప్రసాద్(Andhra Cricket Association Secretary) ధ్రువీకరించారు.
గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రంజీలో ప్రాతినిధ్యం వహించాడు హనుమ విహారి. ఇప్పుడు హైదరాబాద్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు యూకే వెళ్లిన విహారి.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఇరుజట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడం వల్ల స్వదేశానికి తిరిగి వచ్చాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో హనుమ విహారి.. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2018లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కెరీర్లో ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి, 624 పరుగులు(Hanuma Vihari Stats) చేశాడు. 111 అత్యధిక స్కోరు. ఐపీఎల్లో(Hanuma Vihari IPL Career) 24 మ్యాచ్‌లు ఆడి 284 పరుగులు చేశాడు.
ఇదీ చూడండి.. Team India Best Captain: 'భారత జట్టుకు అత్యుత్తమ కెప్టెన్ అతడే!'