Will Jacks Century : ఇంగ్లాండ్ జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ తాజాగా ఓ నయా రికార్డును నెలకొల్పాడు. మినీ ఐపీఎల్‌ను తలపించే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో శతకం బాది తన సత్తా చాటాడు. 41 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల బాదిన ఈ స్టార్ ప్లేయర్ సౌతాఫ్రికా టీ20లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. అంతే కాకుండా తన సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ వేదికైన సెంచూరియన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినప్పటికీ విల్ అద్భుతంగా రాణించాడు. కేవలం 23 బంతుల్లోనే జాక్వెస్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వేగంగా సెంచరీని చేరుకున్నాడు.
-
The Madness of Will Jacks....!!!!
— Johns. (@CricCrazyJohns) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
- Will Jacks smashed 101 runs from just 42 balls in SA20, A player to watch in RCB in coming IPL seasons. pic.twitter.com/jKYMKWCR1i
">The Madness of Will Jacks....!!!!
— Johns. (@CricCrazyJohns) January 18, 2024
- Will Jacks smashed 101 runs from just 42 balls in SA20, A player to watch in RCB in coming IPL seasons. pic.twitter.com/jKYMKWCR1iThe Madness of Will Jacks....!!!!
— Johns. (@CricCrazyJohns) January 18, 2024
- Will Jacks smashed 101 runs from just 42 balls in SA20, A player to watch in RCB in coming IPL seasons. pic.twitter.com/jKYMKWCR1i
మ్యాచ్ సాగిందిలా:
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగుల స్కోర్ చేసింది. ఇక విల్ జాక్స్‌కు తోడుగా ఈ మ్యాచ్‌లో కొలిన్ ఇన్‌గ్రామ్(43)రాణించాడు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులే చేయగలిగింది. మాథ్యూ బ్రీట్జ్‌కే(33), క్వింటన్ డికాక్(25) ఆడినప్పటికీ డర్బన్ జట్టు ఓటమిని చవిచూసింది. ఇక సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టోప్లీ మూడు వికెట్లు తీయగా, మార్కస్ స్టోయినీస్, కేశవ్ మహరాజ్, జూనియర్ డాలా, కీమో పాల్, డ్వేన్ ప్రిటోరియస్ చెరో వికెట్ తీశారు.
Will Jacks RCB : మరోవైపు ఈ గేమ్ స్టార్‌గా నిలిచిన విల్ జాక్స్ ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ ప్లేయర్లు పలు టోర్నీల్లో నిలకడగా రాణిస్తుండటం చూసి ఆ జట్టు అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు. విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లు వివిధ ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుండగా తాజాగా ఈ లిస్ట్‌లోకి విల్ జాక్స్ వచ్చాడు. దీంతో ఈ సారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగనుందంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
IPL 2024 : బాంగర్ పోయే.. అండీ వచ్చే.. RCBకి కొత్త కోచ్.. ఈ సారైనా కప్పు కొట్టేనా?