ఫిట్నెస్ లేకపోతే ఏ ఆటలోనైనా సరే రాణించడం కష్టం. క్రికెట్లో అయితే సదరు ప్లేయరు పరుగులు చేయలేకపోయినా, మైదానంలో దూకుడుగా ఉండకపోయినా.. అతడిని పక్కన పెట్టేస్తారు. దాంతో రిటైర్మెంట్ తీసుకోవాలంటూ విమర్శకులు అతడిపై ఒత్తిడి తీసుకొస్తారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అనుభవం ధోనీకి ఎదురైంది. గతేడాది ఆగస్టు 15న తన 38 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే గతంలో ఓ బ్యాట్స్‌మన్ దాదాపు 52 ఏళ్ల వయసు వరకు క్రికెట్లో కొనసాగాడు అంటే నమ్మగలరా?
ఇంగ్లాండ్ యార్క్‌షైర్‌కు చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్.. 52 ఏళ్ల 165 రోజుల వయసులో తన చివరి టెస్టు ఆడాడు. తద్వారా ఎక్కువ వయసులో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్న ప్లేయర్‌గా నిలిచాడు.
మొత్తంగా తన కెరీర్లో 58 టెస్టులాడిన రోడ్స్.. 2,325 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. అలానే అత్యధికంగా 1110 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 39, 969 పరుగులు చేశాడు. అలానే రికార్డు స్థాయిలో 4204 వికెట్లు తీశాడు.
ఇవీ చదవండి: