ETV Bharat / sports

WFI ప్రెసిడెంట్​ రాజీనామాకు భారత రెజ్లర్ల డిమాండ్​.. ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌?

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ భారత రెజ్లర్లు పట్టుబట్టారు. ఇంతకీ ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌?

బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌
author img

By

Published : Jan 20, 2023, 4:15 PM IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో క్రీడాకారిణులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు రోడ్డెక్కడం కలకలం సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ వారంతా దిల్లీలో జంతర్​మంతర్​ వద్ద ధర్నా చేపట్టారు. బ్రిజ్​ భూషన్​ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా బ్రిజ్‌ భూషణ్‌ పేరు వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఆయన ఎవరంటే?

చిన్నప్పటి నుంచే..
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జన్మించిన బ్రిజ్‌ భూషణ్‌కు చిన్నప్పటి నుంచే కుస్తీ మీద ఆసక్తి ఎక్కువ. అనంతరం కుస్తీ నేర్చుకున్నారు. యుక్త వయసులో పలు పోటీల్లో పాల్గొన్న ఆయన.. 1980ల్లో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రామ జన్మభూమి ఉద్యమంలో భాజపా అగ్రనేత అడ్వాణీతో కలిసి విస్తృతంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. ఈ ఉద్యమంతో స్థానికంగా బ్రిజ్‌ భూషణ్‌ పేరు మార్మోగింది.

బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌

1991 ఎన్నికల్లో భాజపా టికెట్​..
దీంతో 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోండా నియోజకవర్గం నుంచి భాజపా ఆయనకు టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బ్రిజ్‌ భూషణ్‌ తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. కొన్ని కారణాలతో భాజపా నుంచి విడిపోయి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2009లో ఎస్పీ అభ్యర్థిగా కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌

భాజపాలో బలమైన నేతగా..
అయితే 2014 సార్వత్రిక ఎన్నికల ముందు మళ్లీ భాజపా గూటికి చేరిన ఆయన.. కైసర్‌ గంజ్‌ నుంచి మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ వరుసగా మూడోసారి గెలిచి.. భాజపాలో బలమైన నేతగా మారారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బ్రిజ్‌ భూషణ్‌ కూడా నిందితుడిగా ఉండగా.. 2020లో కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది.

బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌

దశాబ్దానికి పైగా అధ్యక్షుడిగా..
అలనాటి మల్ల యోధులు జనార్ధన్‌ సింగ్, రామ్‌ ఆస్రే, రామచంద్ర, గంగా ప్రసాద్‌ వంటి వారితో బ్రిజ్‌ భూషణ్‌కు సత్సంబంధాలున్నాయి. దీంతో 2011లో తొలిసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 12 ఏళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై.. వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మూడు దశాబ్దాలుగా యూపీలో బలమైన రాజకీయ నేతగా కొనసాగుతున్న బ్రిజ్‌ భూషణ్‌కు ఆ రాష్ట్రంలో 50కి పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. సొంత రెజ్లింగ్‌ అకాడమీ కూడా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.