West Indies Tour Of India 2023 Schedule : విండీస్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఈనెల 12 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు జరగబోయే టోర్నీల్లో పాల్గొనేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇందుకు సంబంధించి ప్రాక్టీస్ మ్యాచులను కూడా ఆడుతోంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లకు సర్‌ప్రైజ్ ఇస్తూ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీఫీల్డ్ సోబెర్స్ స్వయంగా ఆయన భార్యతో కలిసి భారత శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అక్కడున్న మన ఆటగాళ్లతో సరదాగా మాట్లాడి వారిలో మంచి ఉత్సాహాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియోను కరేబియన్ క్రికెట్ పాడ్‌కాస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
-
In Barbados & in the company of greatness! 🫡 🫡#TeamIndia meet one of the greatest of the game - Sir Garfield Sobers 🙌 🙌#WIvIND pic.twitter.com/f2u1sbtRmP
— BCCI (@BCCI) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">In Barbados & in the company of greatness! 🫡 🫡#TeamIndia meet one of the greatest of the game - Sir Garfield Sobers 🙌 🙌#WIvIND pic.twitter.com/f2u1sbtRmP
— BCCI (@BCCI) July 5, 2023In Barbados & in the company of greatness! 🫡 🫡#TeamIndia meet one of the greatest of the game - Sir Garfield Sobers 🙌 🙌#WIvIND pic.twitter.com/f2u1sbtRmP
— BCCI (@BCCI) July 5, 2023
ఈ వీడియోలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ తదితరులు సోబెర్స్‌తో మాట్లాడుతూ కనిపించారు. అయితే కింగ్ కోహ్లీతో మాత్రం కాస్త సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ కనిపించారు సోబెర్స్. అలాగే తన భార్యను ప్రత్యేకంగా అందరికీ పరిచయం చేశారు ఈ విండీస్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్స్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
వాళ్లు తిరిగి వచ్చేస్తారు!
2023-25లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్‌ను విండీస్ పర్యటనతోనే ప్రారంభించనుంది భారత్. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇరు జట్లూ తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. ప్రస్తుతం విండీస్ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆడుతోంది. అయితే ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించలేదు. ఈ క్రమంలో ఓమన్, శ్రీలంక జట్లతో విండీస్ ఆడాల్సి ఉంది. అవకాశాలు లేకపోవడంతో విండీస్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ భారత్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను కూడా ప్రకటించింది.
"జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ ముందుగానే విండీస్‌కు చేరుకుంటారు. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ దశలో జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉండరు. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో వీరు ఆడాల్సి ఉన్నందున వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాం".
- విండీస్ ట్వీట్
పసికూన చేతిలో పరాభావం..
రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ 2023కు అర్హత సాధించలేకపోయింది. 48 ఏళ్ల ఈ మెగా టోర్నీ చరిత్రలో మొదటి సారి టాప్ 10 టీమ్‌లలో స్థానం సంపాదించలేకపోయింది. వరల్డ్ కప్‌నకు అర్హత సాధించడానికి జులై 1న జరిగిన క్వాలిఫయర్స్ పోరులో పసికూన స్కాట్లాండ్తో చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయి వరల్డ్‌కప్ రేస్ నుంచి తప్పుకుంది.