Vrinda Ghanshyam Rathi Test Cricket Umpire : భారత మహిళా క్రికెట్ అంపైర్ వృందా ఘనశ్యామ్ రాఠీ అరుదైన ఘనతం సాధించింది. భారత తొలి మహిళా టెస్ట్ అంపైర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టుతో టీ20 జరుగుతున్న సందర్భంగా ఈ కొత్త కోచ్‌ను మేనేజ్మెంట్ పరిచయం చేసింది.
2014లో ముంబయి క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది వృంద. ఆ తర్వాత 2018లో బీసీసీఐ నిర్వహించిన పరీక్షలోనూ పాస్ అయ్యింది. ఇక 2020లో ఐసీసీ డెవలప్మెంట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లుకు ఆమె ప్రమోషన్ పొందింది. 2022లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రాఠీ అంపైర్‌గా వ్యవహరించింది. అంతే కాకుండా ఈ ఏడాది చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లోనూ అంపైర్‌గా వ్యవహరించింది.
వృందా రాఠీ ఇప్పటివరకు 13 మహిళా వన్డే మ్యాచ్‌లు, 43 మహిళా టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసింది. మీడియం పేసర్ అయిన వృంద తన కాలేజీ రోజుల్లో నాలుగేళ్లపాటు ముంబయి యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో వృందా రాఠీతో పాటు కేఎన్ అనంతపద్మనాభన్ (ఇండియా) సెకండ్ ఫీల్డ్అంపైర్గా ఉన్నారు. వీరేంద్ర శర్మ థర్డ్ అంపైర్, జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు.
తొమ్మిదేళ్ల తర్వాత సొంత గడ్డకు!
INDW Vs ENGW Test Series 2023 : మరోవైపు తొమ్మిదేళ్ల తర్వాత మహిళల టెస్ట్ క్రికెట్ సొంత గడ్డకు తిరిగివచ్చింది. 2014 తర్వాత భారత్‌లో మహిళల టెస్ట్ జరగడం ఇదే మొదటి సారి. మూడు టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం భారత్ పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ జట్టు. ఇప్పటికే ఆడిన మూడు టీ20ల్లో 2-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా భారత్ జట్టు 38 టెస్టులు ఆడింది. ప్రస్తుతం వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్‌తో భారత్ తలపడుతోంది.
చరిత్ర సృష్టించిన వృందా రాఠీ- భారత తొలి మహిళా టెస్ట్ క్రికెట్ అంపైర్‌గా ఘనత
నాకు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉంది- నా మూత్రపిండాలు సరిగా పనిచేయలేవు! : కామెరూన్ గ్రీన్