ETV Bharat / sports

'అక్టోబర్‌ 23 నాకెంతో ప్రత్యేకం.. ఆ సాయంత్రం అద్భుతం'.. కోహ్లీ ట్వీట్​ వైరల్​! - విరాట్​ కోహ్లీ కొత్త ట్వీట్​

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియా సెమీస్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. అయితే పాకిస్థాన్‌ మీద ఆడిన ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని విరాట్ కోహ్లీ తన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 26, 2022, 11:45 AM IST

Virat Kohli Tweet: టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. పొట్టి కప్‌లో భారత్‌ సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్‌ స్టేజ్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించడంలో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ ఒక్క మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీ ఆసాంతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీకి పాక్‌పై చేసిన 82* పరుగులు ప్రత్యేకమైనవి. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి భారత్‌కు విజయం చేకూర్చి పెట్టాడు. ఈ క్రమంలో అప్పటి మ్యాచ్‌ను మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గుర్తుకు తెచ్చాడు.

virat-kohli-reminisces-about-knock-vs-pakistan-in-t20-world-cup
విరాట్​ కోహ్లీ ట్వీట్​

"అక్టోబర్ 23వ తేదీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి వరకు చాలా మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఎప్పుడూలేనంత బలమొచ్చినట్లు అనుభూతి కలిగింది. ఆ సాయంత్రం అద్భుతం" అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేశాడు. ఏడు ఓవర్లకే 31 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయిన భారత్‌ను హార్దిక్ పాండ్యతో (40)తో కలిసి విరాట్ నిలబెట్టాడు. షహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, హారిస్ రవుఫ్ వంటి పేసర్లను తట్టుకొని అజేయంగా నిలిచాడు. పొట్టి కప్ టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్‌ కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.