ETV Bharat / sports

'కోహ్లీ.. ఆ ఒక్క షాట్‌ స్వేచ్ఛగా ఆడు'

Virat Kohli Ravisastri: భారత మాజీ సారథి విరాట్​ కోహ్లీ.. ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించడానికి ఎప్పుడూ కష్టపడుతుంటాడని టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. పంజాబ్​,బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో స్పిన్నర్లను ఎదుర్కొవడానికి స్వీప్​ షాట్లు కొట్టిన కోహ్లీ.. అలాంటి షాట్లను స్వేచ్ఛగా ఆడాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

ravishastri kohli
ravishastri kohli
author img

By

Published : Mar 31, 2022, 6:36 PM IST

Virat Kohli Ravisastri: టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ సారథి విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవిశాస్త్రి మార్గదర్శకంలోనే కెప్టెన్‌గా కోహ్లీ విదేశాల్లో ఎన్నో అపూర్వ విజయాలను నమోదు చేశాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా మారిన రవిశాస్త్రి టీ20 మెగా టోర్నీలో విరాట్ ప్రదర్శనపై స్పందించాడు. అంతేకాకుండా షాట్ల ఎంపికపై పలు సూచనలు చేశాడు. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ పంజాబ్‌పై 29 బంతుల్లో 41 పరుగులు చేశాడు. పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లో ఎటాక్‌ చేసేందుకు విరాట్‌ తన పాదాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడని రవిశాస్త్రి అభినందించాడు.

"విరాట్‌ కోహ్లీలో నాకు నచ్చే అంశం పోరాట పటిమ. ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించేందుకు ఎప్పుడూ కష్టపడుతుంటాడు. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు తన పాదాలను వినియోగించుకునేందుకు సన్నద్ధమయ్యాడు. అందుకే పంజాబ్‌తో మ్యాచ్‌లో స్వీప్‌ షాట్లను కొట్టగలిగాడు. ఇది చాలా ముఖ్యమైన షాట్. అయితే, కోహ్లీ ఎక్కువగా దానిని ఆడడు. అందుకే చెబుతున్నా ఇలాంటి షాట్లను స్వేచ్ఛగా ఆడితేనే పరుగులు వస్తాయి. నెట్స్‌లో ఫాస్ట్‌ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేయడం కన్నా స్పిన్‌పై దృష్టిపెట్టాలి. స్పిన్నర్‌తో ఎక్కువగా బౌలింగ్‌ వేయించుకుని స్వీప్‌ షాట్లను ఆడేందుకు ప్రయత్నించాలి. ఒక్కసారి స్వీప్‌ షాట్లను ఆడేందుకు బ్యాటర్‌ ప్రయత్నిస్తే బౌలింగ్‌ చేసేందుకు స్పిన్నర్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు" అని రవిశాస్త్రి వివరించాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో రోహిత్​కేమో రూ.3కోట్లు.. కోహ్లీకి రూ.12లక్షలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.