ETV Bharat / sports

Under-19 Teamindia: కష్టాలు, సవాళ్లను అధిగమించి.. విజేతలుగా ఎదిగి - అండర్​ 19 వరల్డ్​ కప్​ కరోనా టీకా వ్యాక్సిన్​

Under-19 Team India players challenges: టీమ్‌ఇండియా.. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించి యావత్‌ దేశ ప్రశంసలను అందుకుంది. ఈ టోర్నీలో తమకెవరూ సాటిలేరని నిరూపించుకుంది. అయితే ఈ విజయం వెనుక మన కుర్రోళ్ల కష్టం చాలానే దాగి ఉంది. మైదానంలోనే కాదు.. మైదానం వెలుపలా ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంది.

Under-19 Team India players challenges:
అండర్​-19 భారత జట్టుకు సవాళ్లు
author img

By

Published : Feb 23, 2022, 7:43 AM IST

Under-19 Team India players challenges: భారత యువ జట్టు ఇటీవల అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచి అందరి మన్ననలను పొందింది. అయితే ఈ క్రమంలో మైదానంలోనే కాదు.. మైదానం వెలుపలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అసలు టోర్నీ ఆరంభానికి ముందే, కరీబియన్‌ దీవుల్లో అడుగు పెట్టడంతోనే వాళ్లు ఎంతగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు వెల్లడైంది. ఆ కథేంటో చూద్దాం పదండి.

under 19 worldcup schedule జనవరి 14-ఫిబ్రవరి 5 మధ్య జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆద్యంతం నిలకడగా రాణించిన భారత యువ జట్టు.. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో అయిదోసారి ప్రపంచకప్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం వెస్టిండీస్‌కు వెళ్లిన భారత జట్టులో కొవిడ్‌-19 టీకా తీసుకోని ఏడుగురు కుర్రాళ్లను అధికారులు విమానాశ్రయంలో 24 గంటలకుపైగా నిర్బంధించారట. ప్రభుత్వం రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందట. దుబాయ్‌ నుంచి అమ్‌స్టర్‌డామ్‌ గుండా పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌కు సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆటగాళ్లు ఇలా ఇబ్బంది పడాల్సివచ్చింది. టీకా వేసుకోని కారణంగా వెంటనే స్వదేశం తిరిగి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు భారత కుర్రాళ్లను ఆదేశించారు. ఆ కుర్రాళ్లలో ఎడమచేతి వాటం పేసర్‌ రవి కుమార్‌, ఓపెనర్‌ రఘువంశీ కూడా ఉన్నారు. ఐసీసీ, బీసీసీఐలోని సహచరుల సహాయంతో టీమ్‌ మేనేజర్‌ లొబ్‌జాంగ్‌ టెంజింగ్‌ వారిని ఆదుకున్నాడు. సమస్య పరిష్కారానికి భారత్‌, ట్రినిడాడ్‌ ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగాయి. ‘‘పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో దిగాక మేం ప్రత్యేక విమానంలో గయానాకు వెళ్లాల్సివుండగా.. మా జట్టులోని ఏడుగురు కుర్రాళ్లను ఆపేశారు. వాళ్లు టీకా తీసుకోకపోవడమే అందుకు కారణం. 18 ఏళ్ల లోపు వారికి భారత్‌లో ఇంకా టీకాలు మొదలు కాలేదని ఇమిగ్రేషన్‌ అధికారులకు వివరించడానికి ప్రయత్నించాం. కానీ వాళ్లు వినలేదు. తర్వాతి విమానానికే భారత్‌ వెళ్లిపోవాలని చెప్పారు’’ అని టెంజింగ్‌ చెప్పాడు. టెంజింగ్‌ సిక్కిం క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు. ‘‘మేం అక్కడి నుంచి పారిపోతామేమో అన్నట్లుగా భద్రతా సిబ్బంది మమ్మల్ని చుట్టుముట్టారు. ఎయిర్‌లైన్‌, ఇమిగ్రేషేన్‌ అధికారులతో వాదన తప్పలేదు. అందుబాటులో ఉన్న లుఫ్తాన్సా విమానం అప్పటికే వెళ్లిపోయింది. మూడు రోజుల తర్వాత కానీ మరో విమానం లేదు. దాంతో స్థానిక అధికారులతో చర్చించడానికి మాకు సమయం దొరికింది. కుర్రాళ్లతో ఉండాలని నేను నిర్ణయించుకున్నా. విమానాశ్రయం సమీపంలో సౌకర్యాలు లేని హోటల్లో ఉండాల్సి వచ్చింది. ఐసీసీ, స్థానిక ప్రభుత్వాల జోక్యం తర్వాత మాత్రమే సమస్య పరిష్కారమైంది. కుర్రాళ్లకు అది భయానక అనుభవం’’ అని టెంజింగ్‌ వివరించాడు. ఇదంతా జనవరి మొదటివారంలో జరిగింది.

ఆ తర్వాత..: నిర్బంధించిన ఆటగాళ్లకు గయానాలో జట్టుతో కలవడానికి అనుమతి లభించాక జట్టుకు మరో సమస్య వచ్చి పడింది. అయిదుగురు ఆటగాళ్లతో పాటు పాలనా సిబ్బంది మొత్తానికి కొవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో ప్రపంచకప్‌లో భారత జట్టు పోటీపడడమే సందిగ్ధంగా మారింది. లీగ్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ లేకుండానే భారత్‌ ఆడింది. రెండో లీగ్‌ మ్యాచ్‌ (ఐర్లాండ్‌తో) ఆరంభానికి ముందు కొవిడ్‌ కేసులు వచ్చాయి. ‘‘గయానాలో మా జట్టు చాలా కష్టాలు పడింది. నేను, నా సహచరులు కరోనా బారిన పడ్డప్పుడు ఎలాంటి వైద్యం అందలేదు. మమ్మల్ని పరీక్షించేందుకు నిర్వాహకులు వైద్యుణ్ని పంపలేదు. మందులూ ఇవ్వలేదు. మా ఫిజియో మమ్మల్ని ఆదుకున్నాడు. వ్యవస్థ విఫలమైంది. మేమున్న హోటల్లో జట్ల కోసం ప్రత్యేక అంతస్తులు కేటాయించలేదు. ఇతర అతిథులు ఉన్న అంతస్తులోనే మేమూ ఉన్నాం. గదుల్లో నీటి వసతి కూడా సరిగా లేదు. ఆహారం విషయంలోనూ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తు సమీపంలో ఉన్న భారతీయ రెస్టారెంట్లు మాకు సహాయపడ్డాయి’’ అని టెంజింగ్‌ చెప్పాడు. ‘‘ప్రాక్టీసు చేసిన స్టేడియంలో వాష్‌రూమ్‌లలో నీళ్లు లేవు. మా రాష్ట్ర సంఘాలు, బీసీసీఐ బయో బబుల్‌లో ఇంతకన్నా మెరుగ్గా దేశవాళీ ఈవెంట్లను నిర్వహించగలవు’’ అని అన్నాడు. భారత్‌ నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడిన అంటిగ్వాలో మంచి సదుపాయాలు ఉన్నాయని తెలిపాడు.

ఇదీ చూడండి: Hundred League 2022: మళ్లీ 'ది 100'లో మంధాన, జెమిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.