ETV Bharat / sports

వరల్డ్​కప్​లో టాప్​ - ఐపీఎల్​లో ఎంట్రీ- మినీ వేలంలో భారీ ధర పలకనున్న స్టార్స్ వీరే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 3:42 PM IST

Top Players In IPL Mini Auction : ఐపీఎల్ 2024 సీజన్ కోసం దుబాయ్​ వేదికగా ఈ నెల 19న మినీ వేలం జ‌ర‌గ‌నుంది. ఇందులో ఇటీవ‌లే ముగిసిన వ‌రల్డ్ క‌ప్ లో అద‌ర‌గొట్టిన స్టార్ ప్లేయ‌ర్లు కూడా పాల్గొన‌నున్నారు. ఈ సారి వారు భారీ ధ‌ర ప‌లికే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి స్టార్స్ ఎవ‌రో ఒక లుక్కేద్దాం.

Top Players In IPL Mini Auction
Top Players In IPL Mini Auction

Top Players In IPL Mini Auction : రానున్న వేస‌విలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్ కోసం దుబాయ్ వేదికగా ఈ నెల 19న మినీ వేలం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే పలు జ‌ట్లు త‌మ‌కు న‌చ్చిన ప్లేయ‌ర్లు ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసుకున్నాయి. అయితే మినీ వేలంలో దగ్గర పడుతున్న వేళ మిగతా ఆటగాళ్లు త‌మ పేర్లనుఈ వేలంలో న‌మోదు చేసుకున్నారు. అయితే అందులో కొంద‌రు తొలిసారి ఐపీఎల్ ఆడ‌నుండగా, మరికొందరేమో 2023 వ‌ర‌ల్డ్ క‌ప్​లో అద‌ర‌గొట్టి ఈ మిని వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. మ‌రి ఆ స్టార్ ప్లేయ‌ర్లు ఎవరో ఓ లుక్కేద్దామా.

1. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)
ఈ లిస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. 2016 - 2017 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు. ప్ర‌స్తుతం మ‌రోసారి ఐపీఎల్ ఆడేందుకు బరిలోకి దిగనున్నాడు. 29 ఏళ్ల ఈ స్టార్​ ప్లేయర్​ ఇటీవలే జరిగిన ప్ర‌పంచ క‌ప్ ఫైనల్​లో భారత జట్టుపై 120 బంతుల్లో 137 పరుగులు చేసి త‌న జ‌ట్టుకు మ‌ర‌పురాని విజ‌య‌న్ని అందించాడు. ఈ నేపథ్యంలో ట్రావిస్​ ఈ వేలంలో భారీ ధర‌కు అమ్ముడే పోయే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

2. పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు కెప్టెన్‌ పాట్ క‌మిన్స్ తన జట్టుకు ఆరో ప్రపంచకప్​ను అందించిన స్టార్​ క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్​లోనూ మంచి ఫామ్​ కనబరిచిన కమిన్స్​, 2024 ఐపీఎల్ సీజన్​లో ఆడేందుకు త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు. గతంలో కోల్​క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్ అంత‌ర్జాతీయ క్రికెట్​ని దృష్టిలో ఉంచుకుని గ‌త సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఐపీఎల్​లో రాణించాలని నిర్ణ‌యించుకున్నాడు. ఇక ప్ర‌పంచ క‌ప్ గెలిచిన నేప‌థ్యంలో ఇత‌డ్ని భారీ ధ‌ర‌కు కొని, త‌న సేవ‌ల్ని ఉప‌యోగించుకోవాల‌ని ప‌లు ఫ్రాంఛైజీలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

3. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ యంగ్ సెన్సేష‌న్ ర‌చిన్ ర‌వీంద్రకు ఈ వేలంలో మంచి ధ‌ర ప‌లికే అవ‌కాశ‌ముంది. భార‌తీయ మూలాలు క‌లిగిన ఈ స్టార్​ క్రికెటర్ గ‌త‌ ప్ర‌పంచక‌ప్ టోర్నీలో అటు బ్యాట్​తోనూ, ఇటు బంతితోనూ రాణించాడు. 10 ఇన్నింగ్స్‌లు ఆడి 64.22 సగటుతో 578 పరుగులు చేశాడు. అందులో 3 సెంచ‌రీలు, 2 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

4. గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా)
ఇటీవలే జ‌రిగిన 2023 ప్రపంచకప్‌లో అత్యద్భుతమైన ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చిన సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ రానున్న మినీ వేలంలో అంద‌రి దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ‌న్డే ప్రపంచకప్​లో రికార్డు స్థాయిలో 20 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దీంతో నిల‌క‌డ‌గా వికెట్లు తీయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న ఈ ప్లేయ‌ర్‌ను భారీ ధరకు ద‌క్కించుకోవ‌డానికి ఫ్రాంచైజీలు పోటీ ప‌డ‌తాయి.

5. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)
ఈ ప్రపంచ కప్‌లో డారిల్ మిచెల్ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చూసి ఫ్రాంచైజీలు అత‌ని కోసం పోటీ ప‌డ‌తాయ‌న‌టంలో ఎటువంటి సందేహం లేదు. భారత్​తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్స్​లో 134 ప‌రుగులు సాధించి ఫ్యాన్స్​కి భ‌యం పుట్టించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్​లో 9 ఇన్నింగ్స్​ ఆడి 69 సగటు, 111.06 స్ట్రైక్-రేట్‌తో 552 ప‌రుగులు సాధించాడు. అంతే కాకుండా ఈ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన మొద‌టి ప్లేయర్​గానూ నిలిచాడు.

6. దిల్షాన్ మధుశంక (శ్రీలంక)
శ్రీలంక స్పీడ్‌స్టర్ దిల్షాన్ మధుశంక ప్రపంచకప్‌లో 21 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఫ్రాంచైజీలు ఈ సారి మినీ వేలంలో ఇతడ్ని మంచి ధ‌రకు దక్కించుకునే అవ‌కాశ‌ముంది. ఈ టోర్నీతో త‌న కెరీర్లో తొలిసారి 5 వికెట్స్ హాల్ సాధించిన దిల్షాన్​ ఇప్పటివరకు ఆడిన 14 వ‌న్డేల్లో 31 వికెట్లు సాధించాడు.

7. అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్‌)
ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో అఫ్గానిస్థాన్ జ‌ట్టు నాకౌట్ ద‌శ‌కు చేరుకునే స‌మ‌యంలో ఆ జ‌ట్టు ఆట‌గాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక ద‌శ‌లో ఈ జ‌ట్టు ఇంగ్లాండ్​, పాకిస్థాన్, శ్రీలంకలను ఓడించి సెమీ ఫైన‌ల్‌కి ద‌గ్గరగా వ‌చ్చినప్పటికీ ఇండియా, ఆస్ట్రేలియాల‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఓడిపోయి ఇంటిబాట ప‌ట్టింది. అయితే అజ్మతుల్లాతో పాటు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీలు ఈ టోర్నీలో రాణించి అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఈ మిని వేలంలో అందరి దృష్టిని ఆకర్షించి అజ్మతుల్లా మినీ వేలంలో మంచి ధ‌ర ప‌లికే అవ‌కాశ‌ముంది.

  • A beautiful journey that started as we landed in India yo the last day. It has helped me grow as a player and a person God willing it shall be the beginning of many more beautiful events and performances... Hope to make my country and my people proud always. pic.twitter.com/SGA7kzzpKj

    — Azmatullah Omarzai (@AzmatOmarzay) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'20 కేజీలు తగ్గితే ఐపీఎల్​లో తీసుకుంటా' - అఫ్గాన్​ ప్లేయర్​పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

IPL 2024 వేలానికి 333 మంది ప్లేయర్లతో ఫైనల్​ లిస్ట్​- వీరికే ఫుల్ డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.