ETV Bharat / sports

సొంత గడ్డపై ఇంగ్లాండ్​తో పోరు - హర్మన్‌ప్రీత్‌కు పగ్గాలు - టెస్ట్​ క్రికెట్ కోసం టీమ్​ఇండియా మహిళల జట్టు

Team India Womens Squad : సొంతగడ్డపై ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాతో రెండు కీలక సిరీసుల్లో ఆడనున్న భారత మహిళల తుది జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఇంతకీ ఆ టీమ్స్​లో ఎవరెవరు ఉన్నారంటే ?

Team India Womens Squad
Team India Womens Squad
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 10:36 AM IST

Team India Womens Squad : ఓ వైపు పురుషుల జట్టు టీ 20ల్లో రఫ్ఫాడిస్తుంటే.. మహిళల టీమ్​ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై జరగనున్న రెండు కీలక సిరీసుల్లో ఆడనున్న మహిళల తుది జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఈ రెండు టీమ్‌లకు కూడా హర్మన్‌ప్రీత్‌ కౌర్​కు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత జట్టు రెడీగా ఉంది. ఆ తర్వాత ఇదే జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఆ్రస్టేలియాతో కూడా డిసెంబర్ 21 నుంచి జనవరి 5 వరకు భారత్​ మూడు వన్డేలతో పాటు.. ఓ టెస్టు మ్యాచ్‌ ఆడుతుంది. ఇక ఆసీస్‌తో తలపడనున్న భారత టీ20 సిరీస్‌ జట్టును తర్వాత ప్రకటిస్తారు. ముంబయి వేదికగా ఈ మ్యాచ్​లన్నీ జరుగుతాయి. ఇక భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 ఈ నెల 6న జరుగుతుంది.

ఆ ఇద్దరికి జట్టులో స్థానం..
Team India T20 Womens Squad : మరోవైపు ఇటీవలే మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)లో రాణించిన యువ స్పిన్నర్‌ సైకా ఇషాక్​కు తొలిసారి భారత టీ20 స్థానం దక్కించుకుంది. ఇక వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న కర్ణాటక లెఫ్ట్‌ హ్యాండర్‌ శుభా సతీశ్​ను బీసీసీఐ టెస్టు జట్టులోకి తీసుకుంది.

ఇంగ్లాండ్‌ టీ20లకు టీమ్​ఇండియా తుది జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షెఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్‌జోత్, శ్రేయాంక, మన్నత్‌ కశ్యప్, సైకా ఇషాక్, మిన్ను మని, రేణుకా సింగ్, టిటాస్‌ సాధు, పూజ వస్త్రకర్, కనిక ఆహుజా.

టెస్ట్​ మ్యాచ్​లకు భారత్​ తుది జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షెఫాలీ, రేణుకా సింగ్, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, స్నేహ్‌ రాణా, హర్లీన్‌ దేఓల్, శుభా సతీశ్, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రకర్‌, టిటాస్‌ సాధు.

భారత మహిళల క్రికెట్​.. ఎవరూ పట్టించుకోని స్థాయి నుంచి రూ.5 వేల కోట్ల రేంజ్​కు

Ind Vs Ban Asian Games 2023 : బంగ్లాను చిత్తు చేసిన స్మృతి సేన.. ఇక భారత్​కు పతకం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.