శ్రీలంకతో జరుగుతోన్న చివరిదైన మూడో టీ20సో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ దారుణ ప్రదర్శన చేశారు. కరోనా కారణంగా దాదాపు ఎనిమిది ఆటగాళ్లు దూరమవడం వల్ల సగం మంది కొత్త క్రికెటర్లతో బరిలో దిగిన ధావన్సేన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో నామమాత్ర ప్రదర్శన చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టు కేవలం 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ధావన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి గోల్డన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. తర్వాత గైక్వాడ్ (14), పడిక్కల్ (9), శాంసన్ (0), రానా (6), భువనేశ్వర్ (16) వెంటవెంటనే ఔటయ్యారు.
జట్లు
టీమ్ఇండియా:
శిఖర్ ధావన్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, నితీష్ రానా, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్.
శ్రీలంక:
దసున్ శనక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, పథుమ్ నిశ్శంక, ధనంజయ డిసిల్వా, రమేశ్ మెండిస్, వానిందు హసరంగ, చమీక కరుణరత్నే, అకిల ధనంజయ, దుశ్మంత చమీరా, సమరవిక్రమ..
ఇదీ చూడండి:- IND vs SL: 'మూడో టీ20లో ధావన్, శాంసన్ కీలకం'