Team India New Head Coach : వన్డే వరల్డ్‌కప్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. రెండేళ్లపాటు కోచ్‌గా ఉన్న రాహుల్.. ఆ పదవిలో కొనసాగుతాడా? లేదా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.. కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటాడని కథనాలు వెలువడుతున్నాయి.
అయితే 2021లో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్.. పలు ఐసీసీ టోర్నీల్లో జట్టులో కీలకంగా వ్యవహరించాడు. అతడు కోచ్‌గా ఉన్న సమయంలో భారత్.. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2022 టీ20 సెమీఫైనల్, తాజాగా వన్డే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ దాకా వెళ్లింది. అయితే రాహుల్ మళ్లీ కోచ్‌గా కొనసాగడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. ఇక లక్ష్మణ్‌తోపాటు మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సేహ్వాగ్, అనిల్ కుంబ్లే కూడా రేస్‌లో ఉన్నారట. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.
-
VVS Laxman is likely to be the full-time coach of the Indian team. [TOI]
— Johns. (@CricCrazyJohns) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- Rahul Dravid is not keen on his extension. pic.twitter.com/5Q6WtwOTLC
">VVS Laxman is likely to be the full-time coach of the Indian team. [TOI]
— Johns. (@CricCrazyJohns) November 23, 2023
- Rahul Dravid is not keen on his extension. pic.twitter.com/5Q6WtwOTLCVVS Laxman is likely to be the full-time coach of the Indian team. [TOI]
— Johns. (@CricCrazyJohns) November 23, 2023
- Rahul Dravid is not keen on his extension. pic.twitter.com/5Q6WtwOTLC
49 ఏళ్ల లక్ష్మణ్ 2013లో కోచ్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పుడు ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత మెంటార్‌గా అదే జట్టుకు సేవలందించి.. 2021లో ఎన్సీఏ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉండడం వల్ల.. జట్టులోని ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై ఓ క్లారిటీ కూడా ఉంటుంది. గతంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ భారత్ - ఏతోపాటు సీనియర్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే అండర్ - 19 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇదివరకు బంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా సేవలందించాడు.
Laxman Test Career : లక్ష్మణ్ కెరీర్లో టెస్టు క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. అతడు 134 టెస్టు మ్యాచ్‌ల్లో 45.50 సగటుతో 8781 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. రెండుసార్లు 200+ స్కోర్లు నమోదు చేశాడు.
'అతడు ఒక గొప్ప లీడర్'.. పాండ్య కెప్టెన్సీపై VVS లక్ష్మణ్ కామెంట్స్
రాహుల్ ద్రవిడ్ ఔట్.. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!