Team India In Sri Lanka : ఆసియా కప్ 2023 కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ఇండియా బృందం బుధవారం శ్రీలంక చేరుకుంది. కాసేపటి కిందటే కొలంబో ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లు దిగారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఇతర ఆటగాళ్లతో సహా.. జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి ప్లేయర్లు నేరుగా హోటల్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
-
Team India has arrived in Sri Lanka for their Super 11 Men's ODI Asia Cup campaign. Their tournament begins against their arch-rivals to kick things off this Saturday. Who are you most looking forward to? #AsiaCup2023 pic.twitter.com/2UOENNPqyt
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team India has arrived in Sri Lanka for their Super 11 Men's ODI Asia Cup campaign. Their tournament begins against their arch-rivals to kick things off this Saturday. Who are you most looking forward to? #AsiaCup2023 pic.twitter.com/2UOENNPqyt
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023Team India has arrived in Sri Lanka for their Super 11 Men's ODI Asia Cup campaign. Their tournament begins against their arch-rivals to kick things off this Saturday. Who are you most looking forward to? #AsiaCup2023 pic.twitter.com/2UOENNPqyt
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023
-
Team India have arrived in Sri Lanka. pic.twitter.com/rWAEzODfoI
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team India have arrived in Sri Lanka. pic.twitter.com/rWAEzODfoI
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023Team India have arrived in Sri Lanka. pic.twitter.com/rWAEzODfoI
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023
-
Virat Kohli and team India leave for Sri Lanka. pic.twitter.com/9uXPS2vRpq
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat Kohli and team India leave for Sri Lanka. pic.twitter.com/9uXPS2vRpq
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023Virat Kohli and team India leave for Sri Lanka. pic.twitter.com/9uXPS2vRpq
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023
ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఈ మినీ టోర్నమెంట్‌కు సెప్టెంబర్ 17న తెరపడనుంది. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న భారత్ తొలి మ్యాచ్‌లో, దాయాది పాకిస్థాన్ (Ind vs Pak Asia Cup 2023)తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడని జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది.
Asia Cup 2023 Pak vs Nepal : ఇక టోర్నీలో ముల్తాన్ వేదికగా.. పసికూన నేపాల్, వరల్డ్ నెం.1 వన్డే జట్టు పాక్ మధ్య మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో నేపాల్‌కు చెందిన త్రిషాలా గురుంజ్ (Trishala Gurung), పాకిస్థాన్ సింగర్ అయిమా బేగ్(Aima Baig) పాల్గొని సందడి చేశారు. అయితే నేపాల్.. తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతోంది. వారి దేశానికి మద్దతుగా నిలిచేందుకు నేపాల్ పౌరులు.. భారీగానే ముల్తాన్ స్టేడియానికి వచ్చారు.
-
Nepal singer performance at the Asia Cup opening game. pic.twitter.com/hwDTAceKzk
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Nepal singer performance at the Asia Cup opening game. pic.twitter.com/hwDTAceKzk
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023Nepal singer performance at the Asia Cup opening game. pic.twitter.com/hwDTAceKzk
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023
Asia Cup India Titles : ఆసియా కప్ హిస్టరీలో భారత్ అత్యధికంగా ఏడుసార్లు (6 సార్లు వన్డే, ఒకసారి టీ20 ఫార్మాట్) విజేతగా నిలిచింది. తర్వాత స్థానంలో శ్రీలంక ఆరు సార్లు (5 సార్లు వన్డే, ఒకసారి టీ 20 ఫార్మాట్) విజేతలుగా నిలిచాయి. పాకిస్థాన్ రెండు సార్లు నెగ్గింది. ఇక ఈ టోర్నీ.. గత రెండు సీజన్లు (2016, 2022) టీ20 ఫార్మాట్లో జరగ్గా.. ఈసారి వన్డే ఫార్మాట్లో జరుగుతోంది. ఇక ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నింటికీ శ్రీలంకనే వేదికకానుంది.
Asia Cup Records : ఆసియాకప్‌నకు వేళైంది.. ఈ 10 ఇంట్రెస్టింగ్ పాయింట్స్, రికార్డ్స్ తెలుసా?