T20 World Cup Ind Vs Ban: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక పోరు టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సెమీస్ ఆశల్ని సజీవం చేసుకుంది. బంగ్లాదేశ్.. వర్షం కారణంగా భారత జట్టు నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని 151 రన్స్‌కు కుదించినా ఛేదించలేకపోయింది. లిట్టన్ దాస్(60:27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో అర్షదీప్, హార్దిక్ పాండ్య చెరో రెండు వికెట్ల తీయగా.. షమీ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (2) విఫలం కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (50) ఫామ్ అందిపుచ్చుకొని అర్ధశతకం సాధించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (64*: 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆఖర్లో అశ్విన్ (13: 6 బంతుల్లో సిక్స్, ఫోర్) ధాటిగా ఆడాడు. సూర్యకుమార్ (30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ 3, షకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇదీ చూడండి: T20 WorldCup:టీమ్‌ఇండియా ప్రదర్శనపై దాదా కీలక వ్యాఖ్యలు