టీమ్ఇండియా సారథిగా విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్(T20 World Cup 2021) సాధిస్తే చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ ఛాంపియన్ గౌతమ్ గంభీర్(Gambhir on Kohli) అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ కోహ్లీ కెరీర్‌లో ఐసీసీ ట్రోఫీ లోటుపై స్పందించాడు. టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్ సాధించి 14 ఏళ్లు గడిచిందని, దీంతో ఇప్పటికే చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని గంభీర్ వివరించాడు.
"ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలనే కోహ్లీ పట్టుదలతో ఉంటాడు. మిగతా ఆటగాళ్లందరూ అందుకోసమే ఎదురుచూస్తుంటారని కూడా నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే టీమ్‌ఇండియా ఇప్పటికే పొట్టి కప్పు సాధించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో చాలా కాలంగా మనం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఇక్కడ కోహ్లీ చివరిసారి టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్సీ చేస్తున్నాడనే కారణంతో గెలవకపోయినా భారత్ గెలిచి తీరాలి. అది అతడి సారథ్యంలో నెరవేరితే మరీ మంచిది"
--గౌతమ్ గంభీర్, మాజీ ఆటగాడు.
ధోనీ(Dhoni T20 World Cup) సారథ్యంలో టీమ్‌ఇండియా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. ఆపై 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత టీమ్‌ఇండియా ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. ఇక 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌తో పాటు ఈ ఏడాది 2021 టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్ విఫలమైంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన ఎలాగైనా ఈసారి కప్పు గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది.
ఇదీ చదవండి:
T20 World Cup 2021: విరాట్, రోహిత్.. ఈ రికార్డులు బ్రేక్ చేస్తారా?